9 PM News : తెలంగాణ_ ఆంధ్రప్రదేశ్

9 PM News : తెలంగాణ_ ఆంధ్రప్రదేశ్
భర్త వేధింపులు భరించలేక ఓ మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. బాధితురాలు ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తుంది.

♦ కేంద్రం తీసుకొచ్చిన కొత్త అగ్రి చట్టాలను రద్దు చేయాలంటూ ఒంగోలులో రైతు సంఘాలు నిరసన చేపట్టాయి. వ్యవసాయ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

భర్త వేధింపులు భరించలేక ఓ మహిళా కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. బాధితురాలు ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తుంది.

♦ గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం అన్నవరప్పాడు వద్ద గోవా మద్యం సీజ్‌ చేశారు ఎస్‌ఈబీ అధికారులు. 3వేలకు పైగా సీసాలను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 12 లక్షల వరకు ఉంటుందన్నారు.

♦ కృష్ణా జిల్లా కొండపల్లి పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం జరిగింది. టైర్ల కంపెనీలో మంటలు చెలరేగాయి. భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది.

♦ ఫిబ్రవరి నెలలో 12వ సారి పెట్రోల్‌ ధరలు పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై 36 పైసలు పెంచారు. ముంబైలో లీటరు పెట్రోల్‌ ధర 96గా ఉంది. డీజిల్‌ ధర 87గా నమోదైంది.

♦ అజ్మీరా దర్గా ఉర్సు ఉత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ చాదర్‌ను పంపించారు. దర్గాలో సమర్పించేందుకు ప్రత్యేకంగా తయారుచేయించిన చాదర్‌ను ముస్లీం మత పెద్దలకు కేసీఆర్ అందించారు. ఈ సందర్బంగా ముస్లీం మత పెద్దలు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.

♦ మంథనిలో జరిగిన న్యాయవాద దంపతుల హత్యను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. జంట హత్యలపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సాక్ష్యాలను పకడ్బందీగా సేకరించాలని సూచించింది.

♦ మంథనిలో అక్రమాలపై పోరాడుతున్నందునే అడ్వొకేట్ దంపతుల్ని చంపేశారని PCC చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆరోపించారు. పోలీసుల వ్యవహార శైలిపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. జంట హత్యలపై హైకోర్టు పర్యవేక్షణలో CBI విచారణ జరిపించాల్నారు.

♦ హైదరాబాద్‌ కూకట్‌పల్లి న్యాయస్థాన భవన సముదాయానికి, నివాస గృహ సముదాయ నిర్మాణానికి తెలంగాణ హైకోర్టు సీజే హిమా కోహ్లీ శంకుస్థాపన చేశారు. కూకట్‌పల్లి కోర్టు సొంత భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు.

♦ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా విజయనగరం జిల్లా పార్వతీపురం బెలగాం రైల్వేస్టేషన్‌ వద్ద రైతులు, కార్మిక సంఘాలు ఆందోళనకు నిర్వహించాయి. తక్షణమే ఆ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story