చిన్నారులకు నిమ్స్‌లో ఉచితంగా గుండె ఆపరేషన్లు..

చిన్నారులకు నిమ్స్‌లో ఉచితంగా గుండె ఆపరేషన్లు..
హైదరాబాద్‌లోని నిమ్స్‌లో పిల్లల గుండె శస్త్రచికిత్సలను ఉచితంగా నిర్వహించేందుకు UK సర్జన్లు విచ్చేయనున్నారు.

హైదరాబాద్‌లోని నిమ్స్‌లో పిల్లల గుండె శస్త్రచికిత్సలను ఉచితంగా నిర్వహించేందుకు UK సర్జన్లు విచ్చేయనున్నారు. సెప్టెంబరు 24 మరియు 30 మధ్య వారం రోజుల పాటు నిర్వహించే గుండె శస్త్రచికిత్స శిబిరంలో UK సర్జన్లు ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలను ఉచితంగా నిర్వహిస్తారు.

'హీలింగ్ లిటిల్ హార్ట్స్ చార్లీస్ హార్ట్ హీరోస్ క్యాంప్' కార్యక్రమం కింద నిర్వహించబడుతున్న, నవజాత శిశువులు మరియు పిల్లల కోసం ప్రత్యేక గుండె శస్త్రచికిత్స శిబిరం నిర్వహించనున్నారు. వారి క్లిష్టమైన గుండె పరిస్థితికి ప్రాణాలను రక్షించే శస్త్రచికిత్సలు అవసరం అందుకోసం NIMS ఉచితంగా ఆపరేషన్లు చేయనుంది అని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప అన్నారు.

కార్డియాక్ సర్జరీ హెడ్, ఆల్డర్ హే చిల్డ్రన్స్ హాస్పిటల్, UK, డాక్టర్ రమణ ధన్నపునేని పది మంది సర్జన్లు బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. వీరు నిలోఫర్ హాస్పిటల్‌లోని సర్జన్లతో కలిసి నిమ్స్‌లో గుండె శస్త్రచికిత్సలను నిర్వహిస్తారు.

చిన్నారుల గుండె పరిస్థితికి తక్షణ శస్త్రచికిత్స అవసరమయ్యే పిల్లలు ఉంటారు. వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిమ్స్ వైద్యులు తల్లిదండ్రులను కోరుతున్నారు. మరిన్ని వివరాల కోసం 040-23489025 ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య కాల్ చేసి తెలుసుకోవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story