Vikarabad: పదోతరగతి విద్యార్థి పరీక్ష బాగా రాయలేదని..

Vikarabad: పదోతరగతి విద్యార్థి పరీక్ష బాగా రాయలేదని..
Vikarabad: విద్యార్థి భవిష్యత్తును నిర్ధేశించేది పరీక్షలే అయినా, వాటి కోసం ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని విద్యార్థులకు తెలియట్లేదు.

Vikarabad: విద్యార్థి భవిష్యత్తును నిర్ధేశించేది పరీక్షలే అయినా, వాటి కోసం ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని విద్యార్థులకు తెలియట్లేదు. అటు తల్లిదండ్రుల నుంచి, ఇటు ఉపాధ్యాయుల నుంచి పరీక్షల ఒత్తిడిని ఎదుర్కొంటున్న విద్యార్థులు ఆత్మహత్యే శరణ్యంగా భావించి ప్రాణాలు తీసుకుంటున్నారు. టెన్త్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో వికారాబాద్ జిల్లా యాలాల మండలానికి చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన కిష్టప్ప, మల్లమ్మ దంపతుల కుమారుడు రమేష్. పెద్దమ్మ వద్ద ఉండి అగ్గనూరు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. మొదటి రోజు తెలుగు పరీక్ష సరిగా రాయలేదని మదనపడ్డాడు. హాల్ టికెట్ ఇంట్లో ఉంచి రెండు రోజులు కనిపించకుండా పోయాడు. మూడో రోజు గ్రామం పక్కనే ఉన్న చెరువులో శవమై తేలాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story