Warangal: తోటి డాక్టర్లను వేధించే వారు సమాజానికి ఏం చేస్తారు..: ప్రీతి సోదరి

Warangal: తోటి డాక్టర్లను వేధించే వారు సమాజానికి ఏం చేస్తారు..: ప్రీతి సోదరి
Warangal: డాక్టర్లు దేవుళ్లతో సమానం అని భావిస్తాం. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనది. అది కొందరికే దక్కే అరుదైన అవకాశం.

Warangal: డాక్టర్లు దేవుళ్లతో సమానం అని భావిస్తాం. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనది. అది కొందరికే దక్కే అరుదైన అవకాశం. అలాంటి చదువులు చదువుతూ ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్ధులను హింసకు గురిచేయడం, వేధింపులను భరించలేని అమాయకులు ప్రాణాలు బలితీసుకోవడం.. ఈ నీచ సంస్కృతికి ఇంకెప్పుడు ముగింపు పలుకుయి మెడికల్ కాలేజీలు. అప్పటి వరకు అమాయక ప్రాణాలు గాలిలో కలిసిపోవలసిందేనా.. సరదాకి ఓ సమయం, సందర్భం ఉంటుంది. హద్ధులు మీరితే ఏదైనా అనర్ధానికి దారి తీస్తుందని ఆమాత్రం తెలియదా వాళ్లకి. కాలేజీల్లో ఇంత జరుగుతున్నా లెక్చరర్లు ఏం చేస్తున్నట్టు.. తోటి డాక్టర్లను వేధించేవాళ్లు సమాజానికి ఏం చేస్తారు అని ప్రశ్నిస్తోంది ప్రీతి సోదరి. ఏంతో భవిష్యత్తు ఉన్న అక్క బతుకు బుగ్గిపాలు చేసిన వారిని ఊరికే వదిలిపెట్టకూడదు.. కఠినంగా శిక్షించాలి అని అక్కని తలుచుకుని గుండెలవిసేలా రోదిస్తోంది. అక్కని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించిన రోజు రాత్రి ఏం జరిగిందో తెలియాలి అని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story