హాలియాలో నేలపై తెలంగాణ సీఎం అద్భుత చిత్రపటం..!

హాలియాలో నేలపై తెలంగాణ సీఎం అద్భుత చిత్రపటం..!
అన్నదాతల బతుకులకు భరోసా ఇచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్‌పై టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది.

రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో అన్నదాతల బతుకులకు భరోసా ఇచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్‌పై టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. రైతు వెన్నంటే కేసీఆర్ ఉన్నారన్న సందేశాన్నిస్తూ భూమిపై నాగళ్లతో ముఖ్యమంత్రి భారీ చిత్రాన్ని చిత్రించింది. సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో భూమిపై కేసీఆర్ చిత్రాన్ని, ఆ పక్కనే భుజంపై నాగలితో ఉన్న రైతు చిత్రాన్ని గీశారు. పక్కనే టీఆర్ఎస్ వెంటే నాగార్జున సాగర్‌ అని ఇంగ్లీష్‌లో రాశారు. హాలియా మున్సిపాలిటీ పరిధిలో గీసిన ఈ అద్భుత దృశ్యం.. అందరినీ ఎంతో ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కేసీఆర్ చిత్రాన్ని చిత్రించేందుకు రెండ్రోజుల సమమం పట్టిందని టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ పాటిమీది జగన్‌మోహన్‌రావు తెలిపారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సాగర్ నియోజకవర్గంలో 60 వేల ఎకరాల ఆయకట్టుకు రెండు పంటలకు నీరు అందుతోందని చెప్పారు. కుంకుడు చెట్టు తండా ప్రాజెక్టు, నెల్లికల్ లిఫ్ట్ ప్రాజెక్టులు పూర్తయితే మరనో 35 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని జగన్‌మోహన్‌రావు అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story