'నారప్ప' రూ.40 కోట్లకు డీల్..

Narappa Movie: వెంకటేష్‌ టైటిల్ రోల్ పోషిస్తున్న నారప్ప చిత్రం ఓటీటీ వేదికగా అమెజాన్ ప్రైమ్‌‌లో ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

నారప్ప రూ.40 కోట్లకు డీల్..
X

narappa movie image

Narappa Movie: తమిళంలో ధనుష్ నటించిన అసురన్ మూవీని తెలుగులో వెంకటేష్‌ టైటిల్ రోల్ పోషిస్తున్న నారప్ప చిత్రం ఓటీటీ వేదికగా అమెజాన్ ప్రైమ్‌‌లో ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలుత ఈ సినిమాను థియేటర్‌లో విడుదల చేయాలని భావించినా, కరోనా పరిస్థితుల కారణంగా ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది చిత్ర యూనిట్. దీంతో ఓటీటీలోనే విడుదల చేయక తప్పని పరిస్థితి.

అయితే నారప్ప చిత్రం ఓటీటీలో ప్రదర్శించేందుకు గాను అమెజాన్‌తో రూ.40 కోట్లకు డీల్ చేసుకుందని టాలీవుడ్ టాక్. ఇంకా అదనంగా శాటిలైట్ రైట్స్ కూడా ఉంటాయట. ఈ చిత్రంతో పాటు వెంకటేష్ నటించిన మరో చిత్రం దృశ్యం-2 కి కూడా భారీగానే చెల్లిస్తున్నారు నిర్మాతలు. ఆ సినిమా కోసం రూ.35 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. అయితే దృశ్యం-2 చిత్రం ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో స్పష్టత లేదు.

Next Story

RELATED STORIES