బాలయ్య.. ‘భగవంత్ కేసరి‘ సినిమాతో బిజీ..

బాలయ్య.. ‘భగవంత్ కేసరి‘ సినిమాతో బిజీ..
బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో బాక్సాఫీస్ ను కొల్లగొడుతోన్న బాలయ్య ప్రస్తుతం ‘భగవంత్ కేసరి‘ సినిమాతో బిజీగా ఉన్నాడు.

నటసింహం బాలకృష్ణ సినిమాల లైనప్ క్రేజీగా మారుతోంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో బాక్సాఫీస్ ను కొల్లగొడుతోన్న బాలయ్య ప్రస్తుతం ‘భగవంత్ కేసరి‘ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత బాబీ డైరెక్షన్ లో ఒక చిత్రాన్ని లైన్లో పెట్టాడు. ఇక లేటెస్ట్ గా ఈ రెండు సినిమాలతో పాటు మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట బాలకృష్ణ.

‘అఖండ, వీరసింహారెడ్డి‘ వంటి వరుస విజయాలతో నటసింహం బాలకృష్ణ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు. ఈ సినిమాల తర్వాత ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి‘ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే చాలాభాగం షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇటీవల బాలయ్య బర్త్ డే స్పెషల్ గా రిలీజైన టీజర్ కి సూపర్ అప్లాజ్ వచ్చింది. ఈ మూవీలో బాలకృష్ణకి జోడీగా కాజల్ నటిస్తుంటే కీలకమైన పాత్రలో శ్రీలీల కనిపించబోతుంది. భారీ అంచనాలతో ‘భగవంత్ కేసరి‘ సినిమా దసరా బరిలో విడుదలకు ముస్తాబవుతోంది.

‘భగవంత్ కేసరి‘ తర్వాత బాబీ దర్శకత్వంలో మరో సినిమాని చేయబోతున్నాడు బాలయ్య. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే ముహూర్తాన్ని పూర్తిచేసుకుంది. ఇక అనిల్ రావిపూడి, బాబీ లతో పాటు బోయపాటితో ఒక సినిమాని చేయబోతున్నాడు.

బాలకృష్ణకు ఇప్పటికే మూడు బ్లాక్ బస్టర్స్ అందించిన బోయపాటి ఈసారి మరో బ్లాక్ బస్టర్ అందించడానికి పవర్ ఫుల్ స్క్రిప్టును సిద్ధం చేస్తున్నాడట. 14 రీల్స్ నిర్మించే బాలయ్య-బోయపాటి మూవీ పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కనుందట. బోయపాటి తర్వాత పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట నటసింహం. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్న పరశురామ్ ఆ తర్వాత చేయబోయే చిత్రం బాలయ్యతోనే అనే ప్రచారం జరుగుతోంది. మొత్తంమీద బ్యాక్ టు బ్యాక్ నాలుగు సినిమాలతో బాలయ్య చాలా బిజీగా ఉన్నాడు.

Tags

Read MoreRead Less
Next Story