TOLLYWOOD: రామ్- శ్రీలీల జోడీగా నటిస్తున్న ‘స్కంద‘ గ్లింప్స్ రిలీజ్

TOLLYWOOD: రామ్- శ్రీలీల జోడీగా నటిస్తున్న ‘స్కంద‘ గ్లింప్స్ రిలీజ్
‘స్కంద‘ చిత్రం సెప్టెంబర్ 15న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ - మాస్ స్పెషలిస్ట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో రూపొందుతోన్న క్రేజీ మూవీకి ‘స్కంద‘ అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. రామ్ కి జోడీగా శ్రీలీల నటిస్తున్న ఈ మూవీకి మ్యూజికల్ సెన్సేషన్ తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ‘స్కంద‘ చిత్రం సెప్టెంబర్ 15న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. లేటెస్ట్ గా ‘స్కంద‘ టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేసింది టీమ్. రామ్ పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఈ మాస్ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది.

Tags

Read MoreRead Less
Next Story