'మిస్టర్ సి' కి కరోనా.. ఉపాసన ఎమోషనల్ పోస్ట్

మిస్టర్ సి కి కరోనా.. ఉపాసన ఎమోషనల్ పోస్ట్
X

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌‌కు కొవిడ్ 19 సోకింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు చెర్రీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. కొద్దిరోజుల క్రితం మెగాస్టార్‌ చిరుకి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే తనకు లక్షణాలు కనిపించకపోవడంతో చిరు మరో మూడు చోట్ల టెస్టులు చేయించుకోగా అన్నిచోట్లా కరోనా నెగిటివ్ అని ఫలితం వచ్చింది. ఇటీవలే మెగా బ్రదర్ నాగబాబు కూడా కరోనా బారిన పడ్డారు. మెగా హీరో వరుణ్ తేజ్‌కు కూడా కరోనా సోకింది. తాజాగా చెర్రీకి కూడా కరోనా రావడంతో మెగా అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

అయితే రామ్ చరణ్‌కు కరోనా వైరస్ సోకడంపై ఆయన భార్య ఉపాసన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ''అమ్మయ్య ఈ సంవత్సరం వెళ్లిపోతోంది. వచ్చే సంవత్సరం 2021 అయినా బాగుండాలని కోరుకుంటున్నాను. 'మిస్టర్ సి' కి ఎలాంటి లక్షణాలు లేవు.. ఆయన చాలా దృఢంగా ఉన్నారు. నాకు నెగిటివ్ వచ్చింది. కానీ.. నాకు కూడా కరోనా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం నేను 'మిస్టర్ సి' తో హోం క్వారంటైన్‌లో ఉన్నాను. వేడి ద్రావణాలు తీసుకుంటున్నాం. ఆవిరి పడుతున్నాం. విశ్రాంతి తీసుకుంటున్నాం'' అని ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ చేశారు.

Next Story

RELATED STORIES