Project K: మ్యూజిక్ డైరెక్టర్ ఛేంజ్...

Project K: మ్యూజిక్ డైరెక్టర్ ఛేంజ్...
ప్రాజెక్ట్ కె నుంచి తప్పుకున్న మిక్కీ జే మేయర్; బాలీవుడ్ నుంచి దిగిన మరో మ్యూజిక్ డైరెక్టర్; ఆసక్తికరమైన అప డేట్స్....

ప్రస్తుతం తెలుగు సినీ ప్రియుల చూపులన్నీ ప్రాజెక్ట్ కె మీదే ఉన్నాయి. ఇటు ప్రేక్షకులతో పాటూ ట్రేడ్ వర్గాల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ప్రభాస్ నాగ్ అశ్విన్ కలయిక విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తోన్న సంగతి తెలిసిందే. దీపిక పదుకోనే డార్లింగ్ కు జోడీగా నటిస్తోంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమా టీమ్ లో తాజాగా భారీ మార్పులే చోటుచేసుకున్నాయి. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు తొలుత మిక్కీ జే మేయర్ స్వరాలు అందించబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అతడు సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిర్మాత అశ్వినీదత్ ప్రకటన విడుదల చేశారు. సంతోశ్ నారాయణ్ తో పాటూ బాలీవుడ్ నుంచి మరో యువ మహిళా సంగీత దర్శకురాలు ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నారని తెలిపారు. ఇక దీపికా పదుకోనే తో పాటూ ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కూడా కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. రూ. 500కోట్ల భారీ బడ్జెట్ తో భారతీయ భాషలతో పాటూ, పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 2024 సంక్రాంతి పురస్కరించుకుని జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర బృందం చెబుతోంది.

Tags

Read MoreRead Less
Next Story