Project K: 'ఆవెంజర్స్' లెవెల్‌లో 'ప్రాజెక్ట్ కె'.. రిలీజ్ అప్పుడే..: నిర్మాత

Project K: ఆవెంజర్స్ లెవెల్‌లో ప్రాజెక్ట్ కె.. రిలీజ్ అప్పుడే..: నిర్మాత
Project K: ప్రాజెక్ట్ కె లో ప్రభాస్‌కు జోడీగా దీపిక పదుకొనె నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Project K: పాన్ ఇండియా హీరో అనే ట్యాగ్ సంపాదించుకున్న తర్వాత కేవలం పాన్ ఇండియా చిత్రాలకు మాత్రమే కేరాఫ్ అడ్రస్‌గా మారిపోతారు హీరోలు. ప్రస్తుతం టాలీవుడ్ హీరోల్లో ముందుగా పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు ప్రభాస్. అందుకే దర్శక నిర్మాతలంతా పాన్ ఇండియా కథలతో క్యూ కట్టారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న అలాంటి చిత్రాల్లో ఒకటే 'ప్రాజెక్ట్ కె'.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రమే ప్రాజెక్ట్ కె. నాగ్ అశ్విన్‌కు ఎక్కువగా సినిమాల అనుభవం లేకపోయినా.. తను చెప్పిన కథను నమ్మి మూవీకి ఓకే చెప్పాడు ప్రభాస్. ఇప్పటికే పలుమార్లు ప్రాజెక్ట్ కె లాంటి సినిమా ఇప్పటివరకు తెలుగులో రాలేదని చెప్తూనే వచ్చారు మేకర్స్. ఇక మరోసారి నిర్మాత అశ్వినిధత్ కూడా ఈ మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సినిమా క్వాలిటీ చూసి ప్రేక్షకులు సర్‌ప్రైజ్ అవుతారని అశ్వినిధత్ అన్నారు. ప్రాజెక్ట్ కె ద్వారా చైనా, అమెరికాతో పటు పలు ఇంటర్నేషనల్ మార్కెట్లపై కూడా వారు దృష్టిపెడుతున్నామని తెలిపారు. అంతే కాకుండా ఇది ఆవెంజెర్స్‌లాంటి సినిమా అని చెప్పి అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. 2023 అక్టోబర్ 18న మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తోందట టీమ్. ఒకవేళ అది కుదరకపోతే 2024 జనవరిలో ప్రాజెక్ట్ కె రిలీజ్ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇక ప్రాజెక్ట్ కె లో ప్రభాస్‌కు జోడీగా దీపిక పదుకొనె నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story