వేణుమాధవ్ చివరి కోరిక అదే.. కానీ అది తీరకుండానే..!

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హాస్యనటులున్నారు. ఎవరి స్టైల్ వారిదే. తమ హావభావాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి వారి మదిలో సుస్థిర స్తానాన్ని సంపాదించుకున్నారు.

వేణుమాధవ్ చివరి కోరిక అదే.. కానీ అది తీరకుండానే..!
X

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హాస్యనటులున్నారు. ఎవరి స్టైల్ వారిదే. తమ హావభావాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి వారి మదిలో సుస్థిర స్తానాన్ని సంపాదించుకున్నారు. అలాంటి వారిలో కమెడియన్ వేణుమాధవ్ ఒకరు. మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి స్టార్ కమెడియన్ వరకు ఎదిగాడు వేణుమాధవ్. దాదాపుగా రెండు దశాబ్దాల పాటు బిజీ ఆర్టిస్ట్‌‌గా వేణుమాధవ్ కొనసాగారు.

ఓ సారి రవీంద్రభారతిలో వేణుమాధవ్ చేసిన కామెడీ స్కిట్ ఆయన జీవితాన్నే మార్చేసింది. రవీంద్రభారతిలో మాటల రచయిత దివాకర్ బాబుకు సన్మానం చేస్తుంటే చూడడానికి వెళ్ళి, అందులో వేదికపైన ఒక చిన్న ప్రదర్శన ఇచ్చాడు. అందులో 'గుల గుల గులాబ్ జామ్' అంటూ చెప్పిన డైలాగ్ ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డిలకు చాలా బాగా నచ్చి, సినిమాలో ఓ అవకాశం ఇచ్చారు. అదే సంప్రదాయం చిత్రం. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ హీరోగా వచ్చిన ఈ సినిమాకి గాను వేణుమాధవ్ రూ. 70వేలు పారితోషికం తీసుకున్నారు. అంతకుముందు వేణుమాధవ్ మిమిక్రీ ప్రోగ్రాంకు రూ. 1000 మాత్రమే తీసుకునేవారు. అలా వరుస అవకాశాలతో బిజీ అయిపోయి స్టార్ కమెడియన్‌‌గా వేణుమాధవ్ ఎదిగాడు.

అయితే సినిమాల్లోకి రాకముందు వేణుమాధవ్ టీడీపీ ఆఫీస్‌‌లో పనిచేసేవారు. ఆ సమయంలోనే రాజకీయాల్లోనూ రాణించాలనే ఆకాంక్ష ఆయనకి బాగా ఉండేది. టీడీపీ తరపున పలు కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా నిజయోజకవర్గ ప్రజలకి సేవ చేయాలనీ బాగా ఉందని పలు మార్లు చెప్పుకొచ్చారు కూడా. తన సొంత ఊరు, నియోజకవర్గం మైన కోదాడ నుంచి పోటీ చేయాలని ఎంతగానో ప్రయత్నించారు. ఇదే విషయాన్నీ 2014లో టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళారు. కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. ఇక 2018ఎన్నికల్లో కోదాడ నుండి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసి వెనక్కి తగ్గారు.

కాలేయ సంబంధవ్యాధితో బాధపడుతూ.. వేణుమాధవ్ సికింద్రాబాదులోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2019, సెప్టెంబరు 25 మధ్యాహ్నం గం. 12.21 ని.లకు మరణించారు. ఎమ్మెల్యేగా నిజయోజకవర్గ ప్రజలకి సేవ చేయాలనీ ఎంతగానో అనుకున్న వేణుమాధవ్.. చివరి కోరిక తీరకుండానే కన్నుమూశారు.

Next Story

RELATED STORIES