vamshi paidipally With Vijay : కన్ఫామ్... విజయ్ దళపతితో వంశీ పైడిపల్లి..!

vamshi paidipally With Vijay : కన్ఫామ్... విజయ్ దళపతితో వంశీ పైడిపల్లి..!
vamshi paidipally With Vijay : కెరీర్ మొదటి నుంచి దిల్ రాజ్ కాంపౌండ్ లోనే సినిమాలు చేస్తున్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి.

vamshi paidipally With Vijay : కెరీర్ మొదటి నుంచి దిల్ రాజ్ కాంపౌండ్ లోనే సినిమాలు చేస్తున్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి. మహర్షి చిత్రం తర్వాత కూడా దిల్ రాజ్ కాంబో లోనే మహేష్ తో సినిమా చేయాల్సి ఉంది వంశీ.. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయితే ఇప్పుడు వంశీకి అదిరిపోయే కాంబోని సెట్ చేశారు నిర్మాత దిల్ రాజు.. తమిళ స్టార్ హీరో విజయ్ దళపతితో వంశీ పైడిపల్లి ఓ సినిమా చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వంశీపైడిపల్లి మీడియాతో పంచుకున్నారు.

తన కెరీర్ లోనే అతి పెద్ద ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కనుందని, దీనికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారని వంశీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో ఈ సినిమాని ప్రకటించలేదని, పరిస్థితులన్నీ చక్కబడిన తరువాత చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. దీనితో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. విజయ్ తొలిసారిగా తెలుగులో నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. ఇది విజయ్ కి 66 వ చిత్రం కావడం విశేషం.

Tags

Read MoreRead Less
Next Story