వడ్డే నవీన్ ఎక్కడ.. కనీసం టీవీలో ఇంటర్వ్యూలు కూడా ఎందుకు ఇవ్వడం లేదు?

వడ్డే నవీన్ ఎక్కడ.. కనీసం టీవీలో ఇంటర్వ్యూలు కూడా ఎందుకు ఇవ్వడం లేదు?
సినిమా ఇండస్ట్రీలో గుమ్మడికాయంత టాలెంట్ ఉన్న ఆవగింజంత అదృష్టం ఉండాలని అంటారు. అవును.. ఇది అక్షరాల నిజం.

సినిమా ఇండస్ట్రీలో గుమ్మడికాయంత టాలెంట్ ఉన్న ఆవగింజంత అదృష్టం ఉండాలని అంటారు. అవును.. ఇది అక్షరాల నిజం. బ్యాక్ గ్రౌండ్ ఎంత బలంగా ఉన్నప్పటికీ కొందరు మాత్రం ఫెడ్ అవుట్ అయిపోతుంటారు. ఆ కోవాలోకే వస్తారు హీరో వడ్డే నవీన్. ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ కుమారుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నవీన్.. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన కోరుకున్న ప్రియుడు సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.

మొదటి సినిమాతోనే మంచి నటుడని అనిపించుకున్న నవీన్.. ఆ తర్వాత మనసిచ్చి చూడు, స్నేహితులు, ప్రేమించే మనసు, మా బాలాజీ, బాగున్నారా, నా ఉపిరి ఇలా దాదాపుగా 30 సినిమాలలో హీరోగా నటించాడు. అయితే చూస్తుండగానే నవీన్ తెరపైన కనుమరుగయ్యారు. నవీన్ చివరగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఎటాక్ సినిమలో కనిపించారు. వడ్డే నవీన్ కనీసం బయట ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు.

వడ్డే నవీన్ హీరోగా ఫెడ్ అవుట్ అవ్వడానికి మెయిన్ రిజైన్.. ట్రెండ్ కి తగ్గట్టుగా కథలు ఎంచుకోకపోవడమే అని చెప్పాలి. అన్నీ ఒకే మూస ధోరణిలో వెళ్ళే కథలను నవీన్ ఎంచుకున్నాడు. 2001 తర్వాత నవీన్ చేసిన ఏ సినిమా కూడా విజయాన్ని అందుకోలేదు. వరుసగా సినిమాలు కూడా ఫ్లాప్ అవ్వడంతో హీరోగా వడ్డే నవీన్ ఫెడ్ అవుట్ అయిపోయాడు. కనీసం టీవీలో ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు కూడా ఆయన ఇంట్రెస్ట్ చూపించడం లేదు.

ఆ మధ్య ఆయన కుమారుడి ధోతీ ఫంక్షన్ లో కనిపించాడు నవీన్. ప్రస్తుతం బిజినెస్ పనులను చూసుకుంటున్నాడు. ఆయన మళ్ళీ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాలని మనము కోరుకుందాం.

Tags

Read MoreRead Less
Next Story