Youtube Star Shanmukh Jaswanth:స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. పోలీస్ స్టేషన్లో 'షణ్ముఖ్' రచ్చ రచ్చ

Youtube Star Shanmukh Jaswanth:స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. పోలీస్ స్టేషన్లో షణ్ముఖ్ రచ్చ రచ్చ

Youtube Star Shanmukh Jaswanth:

Youtube Star Shanmukh Jaswanth:మద్యం తాగడం ఈ రోజుల్లో ఒక ప్రెస్టీజియస్ ఇష్యుగా మారిపోయినా.. ఆ మత్తులో కారు డ్రైవ్ చేసుకుంటూ రోడ్డెక్కితే ఎంత మంది అమాయక జీవితాలు బలవుతాయో ఎవరికి ఎరుక.

Youtube Star Shanmukh Jaswanth: సాప్ట్‌వేర్ డెవలపర్‌గా.. లాప్‌టాప్ ముందు కూర్చుని టీమ్‌కి ‌గైడెన్స్ ఇస్తూ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మంచి బాస్‌గా మార్కులు కొట్టేసిన షణ్ముఖ్ జస్వంత్.. తూచ్ అదంతా సిరీస్.. రియల్ లైఫ్‌లో మద్యం మత్తు తలకెక్కితే నా మాట నేనే వినను అంటున్నాడు.. అరెస్టై పోలీస్ స్టేషన్లో రచ్చ రచ్చ చేస్తున్నాడు. నేటి యువతకి తమ క్రియేటివిటీని నిరూపించుకునేందుకు యూట్యూబ్ ఫ్లాట్‌ఫామ్ ఓ చక్కని వేదికగా అవతరించింది.

కంటెంట్ ఉంటే కటౌట్ అవసరం లేదన్నట్లు.. క్లిక్కయితే వెనక్కి తిరిగి చూసుకోనవసరం లేదు.. మిలియన్లలో వ్యూస్.. లక్షల్లో సంపాదన. మనీ మంచీ చేస్తుంది.. మనిషిని పాడూ చేస్తుంది.. మద్యం తాగడం ఈ రోజుల్లో ఒక ప్రెస్టీజియస్ ఇష్యుగా మారిపోయినా.. ఆ మత్తులో కారు డ్రైవ్ చేసుకుంటూ రోడ్డెక్కితే ఎంత మంది అమాయక జీవితాలు బలవుతాయో ఎవరికి ఎరుక.

ఇంకా అదృష్టం బావుండి బాధితులు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. అదే ఎవరికైనా ప్రాణహాని జరిగిఉంటే యూట్యూబ్ స్టార్ జైల్లో ఊచలు లెక్కపెట్టేవాడు.. కొంచెమైనా ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్నారు కోట్ల మంది ప్రేక్షకులను తమ వైపు తిప్పుకుంటున్న యూ ట్యూబ్ స్టార్స్. చాలా దేశాల్లో యూట్యూబ్ స్టార్స్ చాలా మందికి సహాయం చేసిన ఉదంతాలు చూస్తుంటాం. చేయాలనుకుంటే చాలా చేయొచ్చు.. అంతటి ఇమేజి, పాపులారిటీ సంపాదించుకున్న షణ్ముఖ్ కూడా. కానీ ఇలా బుక్కవడం సిగ్గు చేటు. అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు పోలీసులు.

శనివారం సాయింత్రం జూబ్లీహిల్స్ రోడ్ నెం. 52లోని ఉడ్స్ అపార్ట్‌మెంట్స్ నుంచి వెళ్తూ ఓ స్కూటరిస్టుని ఢీకొట్టాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కారు దెబ్బతిన్న విజయ్ ఫిర్యాదు మేరకు షణ్ముఖ్‌పై ఐపీసీ సెక్షన్ 337, 279 కింద కేసు నమోదు చేశారు. స్టేషన్‌లో పోలీసులపై వాగ్వాదానికి దిగి రచ్చ రచ్చ చేశాడు షణ్ముఖ్. నన్నే అరెస్ట్ చేస్తారా.. నేను చేస్తున్న సిరీస్‌కి కోటి వ్యూస్ ఉంటాయి తెలుసా అన్న ధోరణిలో పోలీసులను దబాయించాడు. దాదాపు రెండు గంటలపాటు పోలీసులను ఇబ్బందులకు గురి చేశాడు. ఈ కేసును జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story