అమ్మమ్మ తాతాయ్యల 60 ఏళ్ల ప్రేమ కథ.. మనవడు పంచుకున్న మధురమైన స్టోరీ

అమ్మమ్మ తాతాయ్యల 60 ఏళ్ల ప్రేమ కథ.. మనవడు పంచుకున్న మధురమైన స్టోరీ
60 ఏళ్ల క్రితం పెళ్లయిన వృద్ధ దంపతుల ప్రేమ పూర్వక బాంధవ్యాన్ని వారి మనవడు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో తాత బామ్మలు అందరి హృదయాలను గెలుచుకుంటున్నారు.

60 ఏళ్ల క్రితం పెళ్లయిన వృద్ధ దంపతుల ప్రేమ పూర్వక బాంధవ్యాన్ని వారి మనవడు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో తాత బామ్మలు అందరి హృదయాలను గెలుచుకుంటున్నారు. అనీష్ భగత్ మార్చి 14న ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశాడు.

ఈ జంట ఎప్పుడూ తమ వార్షికోత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది అనారోగ్య కారణాలతో అమ్మమ్మ ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. అతని అమ్మమ్మ ఆసుపత్రికి బయలుదేరడానికి సిద్ధమవుతుండగా, అనిష్ తాతగారు ఆమె కోసం ఓ పాట పాడారు. భార్య అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉంది. ఆమె ఆరోగ్యంగా త్వరగా తిరిగి రావాలని మనసులోనే భగవంతుడిని ప్రార్ధించేవారు. అతడు ఇంట్లో, ఆమె ఆస్పత్రిలో ఉండగానే వారి వివాహ వార్షికోత్సవం వచ్చింది. ఈ సందర్భంగా భార్యకు ఓ చిన్న బహుమతి పంపాలనుకున్నారు. మనవడితో చెప్పి మంచి గిప్ట్ తెప్పించుకున్నారు. అతడి చేతే ఆస్పత్రిలో ఉన్న భార్యకు ఇచ్చి పంపించారు.

మనవడి సహకారంతో భర్త ప్రేమగా పంపించిన బహుమతిని ఆమె స్వీకరించింది. దానిని చూసుకుని మురిసిపోయింది. ఆసుపత్రిలో నర్సుల సమక్షంలో కేక్ కట్ చేసి తన ఆనందాన్ని వారితో పంచుకుంది. ప్రతిఫలంగా, ఆమె తన భర్తకు కొన్ని పువ్వులు పంపింది.

కొన్ని రోజుల తరువాత అమ్మమ్మ ఆరోగ్యం కుదుట పడడంతో ఆమెను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆయనే ముందు వెళ్లి ఆవిడను హత్తుకోవాలని ఉన్నా శరీరం సహకరించక అక్కడే ఉండిపోయారు. ఆమె వడివడిగా అడుగులు వేస్తూ అతడి వైపు కదిలింది. ప్రేమగా దగ్గరకు తీసుకున్న అతడిని మళ్లీ జన్మ ఉంటే మనిద్దరం భార్యాభర్తలుగానే పుడదాం అని మనసులో అనుకున్నారు. ఇద్దరి మధ్య ఆప్యాయతతో కూడిన ఆలింగనం నెటిజన్ల హృదయాలను దోచుకుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో తమ కథనాన్ని పంచుకుంటూ, అనీష్ దానికి క్యాప్షన్‌గా ఇలా పేర్కొన్నాడు: "నేను ఈ తరంలో ఎందుకు పుట్టాను? మీ అందరికీ ధన్యవాదాలు మీ ఆశీర్వాదాలను అమ్మమ్మ, తాతయ్యలకు పంపిస్తున్నాను" అని పేర్కొన్నాడు. వీడియో 1 మిలియన్ వీక్షణలను సంపాదించడంతో వారి మధురమైన ప్రేమకథ సోషల్ మీడియా వినియోగదారుల హృదయాలను దోచుకుంది.

"మీది ఎంత మధురమైన కుటుంబం. "ఆమె ఇంటికి తిరిగి వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆమె ఆరోగ్యంగా జీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను" అని మరొక వినియోగదారుడు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story