బార్బిక్యూ ఫుడ్ పార్శిల్ లో చచ్చిన ఎలుక.. విషమించిన కస్టమర్ ఆరోగ్యం

బార్బిక్యూ ఫుడ్ పార్శిల్ లో చచ్చిన ఎలుక.. విషమించిన కస్టమర్ ఆరోగ్యం
బార్బిక్యూ అంటే బాగానే ఉంటుందనుకున్నాడు.. అయినా ఆకలి వేసినా వెయ్యకపోయినా, సరదాకో, టైమ్ పాస్ కో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం ఈ మధ్య అందరికీ అలవాటైపోయింది..

బార్బిక్యూ అంటే బాగానే ఉంటుందనుకున్నాడు.. అయినా ఆకలి వేసినా వెయ్యకపోయినా, సరదాకో, టైమ్ పాస్ కో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం ఈ మధ్య అందరికీ అలవాటైపోయింది.. ఎక్కడ చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో తెలియదు.. అందంగా ప్యాక్ చేసిన పార్శిల్ చూడ్డానికి చాలా బావుంటుంది. తినేటప్పుడు టేస్ట్ కూడా ఉంటుంది. కానీ ఎలా తయారు చేశారో తెలియదు.. శుభ్రత పాటించారో లేదో అంతకన్నా తెలియదు.. అదేమని పెద్ద వాళ్లు అడిగితే అవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే ఏమీ తినలేమని నీతులు చెబుతుంటారు. ఇదుగో ఇలా తిన్నాక ఆస్పత్రి పాలైతే బావుంటుంది.

ముంబై BBQ నేషన్ నుండి ఆర్డర్ చేసిన వెజ్ మీల్‌లో డెడ్ మౌస్ ఉంది. అది తిన్న కస్టమర్‌ను 75 గంటల పాటు ఆసుపత్రిలో ఉంచింది. బార్బెక్యూ నేషన్ యజమాని, చెఫ్‌పై నాగపాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో రెస్టారెంట్ యాజమాన్యంపై పోలీసులు చర్యలు తీసుకున్నారు.

ముంబైలో, ప్రయాగ్‌రాజ్‌కు చెందిన రాజీవ్ శుక్లా అనే కస్టమర్ వర్లీలోని BBQ నేషన్ నుండి వెజ్ మీల్‌ను ఆర్డర్ చేశాడు. అతని ఆహారంలో చనిపోయిన ఎలుకను కనుగొన్నాడు. దాల్ మఖానీతో కూడిన వెజ్ మీల్‌ను ఆర్డర్ చేశాడు. పార్శిల్ ఇంటికి వచ్చిన తర్వాత, రాజీవ్ దాన్ని ఓపెన్ చేసి తింటున్నప్పుడు చనిపోయిన ఎలుకను గుర్తించాడు. దాంతో అతడికి కడుపులో దేవినట్లైంది. వెంటనే వాష్ రూమ్ కి వెళ్లి వాంతి చేసుకున్నాడు. అయినా కడుపులో గందరగోళంగా ఉండడంతో ఆస్పత్రికి వెళ్లాడు.

ఈ సంఘటన తర్వాత రాజీవ్ ఆరోగ్యం విషమించడంతో 75 గంటల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. అయితే, ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఎఫ్‌ఐఆర్ (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) నమోదు కాలేదు.

Tags

Read MoreRead Less
Next Story