Viral News: కళ్లకు గంతలు కట్టుకుని వంట.. గత 22 ఏళ్లుగా ఇదేపనంట..

Viral News: కళ్లకు గంతలు కట్టుకుని వంట.. గత 22 ఏళ్లుగా ఇదేపనంట..
Viral News: వంట చేయడం కూడా ఓ ఆర్ట్.. ఒళ్లు దగ్గర పెట్టుకుని చేస్తేనే దానికి రుచి వస్తుంది. ఏదో చేశామంటే చేశాం అనుకుంటే ఎవరూ తినలేరు..

Viral News: వంట చేయడం కూడా ఓ ఆర్ట్.. ఒళ్లు దగ్గర పెట్టుకుని చేస్తేనే దానికి రుచి వస్తుంది. ఏదో చేశామంటే చేశాం అనుకుంటే ఎవరూ తినలేరు.. ఆఖరి వంట చేసిన మనం కూడా తినలేం.. పాక శాస్త్ర ప్రావిణ్యంలో ఎవరి స్టైల్ వారిది.. కొందరు అవలీలగా గరిటె తిప్పేస్తారు.. మరి కొందరికి వంట ఓ పెద్ద ప్రహసనం.. వంట అంటే మంటకెత్తుతుంది.. ఆ విసుగులో వంట చేస్తే కూరల్లో ఉప్పో, కారమో ఎక్కువవుతుంది. ఏంటా వంట చేయడం చూసుకునే పన్లేదా అని ఇంట్లో వాళ్ల చేత చీవాట్లు.. కానీ వెస్ట్‌బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో ఓవ్యక్తి గత 22 ఏళ్లుగా కళ్లకు గంతలు కట్టుకుని మరీ వంట చేస్తున్నాడట. శివుడికి మాదిరిగా మూడో నేత్రం ఏమైనా ఉందా ఏంటి ఇంత రుచిగా వంట చేస్తున్నాడు అని కస్టమర్లు ఆశ్చర్యానికి గురవుతుంటారు అతడు చేసి ఐటెంలు టేస్ట్ చేసి.

కళ్లకు గంతలు కట్టుకుని వంట చేయడం.. ఊహించుకోవడానికే భయంగా ఉంది కదూ.. కానీ దుర్గాపూర్‌కు చెందిన ఒక చెఫ్ తన కళ్లకు గంతలు కట్టుకుని వంట చేసే నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్నాడు.


అతడు వంటల్లో అనేక ప్రయోగాలు చేస్తుంటాడు. నగరంలోని ఆహార ప్రియులు అతని చేతితో తయారు చేసిన కొన్ని చైనీస్ వంటను చూసి ముగ్ధులయ్యారు. నేపాల్ చెఫ్ సుభాష్ బహదూర్ ఛెత్రీ వండిన క్రిస్పీ బేబీ కార్న్‌కు చాలా డిమాండ్ ఉంది.


అగ్రని మోర్, బెనచిటి మరియు దుర్గాపూర్‌లకు సమీపంలో ఓ చైనీస్ రెస్టారెంట్ ఉంది. కుక్, సుభాష్ బహదూర్ ఛెత్రి, నేపాల్ నుండి వచ్చి దుర్గాపూర్‌లో శాశ్వత స్ధిర నివాసం ఏర్పరుచుకున్నాడు. దాదాపు 22 సంవత్సరాలుగా చెఫ్ బాధ్యతలు చేపట్టి నగర పౌరులకు రుచికరమైన ఆహారం అందిస్తున్నాడు.


అతని వంట తీరు చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. అతను ఇప్పుడు తన మొత్తం అనుభవానికి కృతజ్ఞతలు తెలుపుతూ కళ్ళు మూసుకుని ఎలాంటి చైనీస్ వంటకాన్ని అయినా చిటికెలో రుచికరంగా తయారు చేయగలడు. కొన్నేళ్లుగా ఛెత్రీ వంటలకు డిమాండ్ బాగా పెరిగింది.


రెస్టారెంట్ యజమాని ప్రకారం, సుభాష్ బహదూర్ ఛెత్రీ వంటను హాబీగా భావిస్తాడు. అతడు వంటను చాలా ఇష్టంగా తయారు చేస్తాడు. వంట పట్ల ఆయనకున్న ప్రేమ వల్లనే కళ్లకు గంతలు కట్టుకుని వంట చేసే కళను అభ్యసించాడు. నగరంలో ప్రజాదరణ ఉన్నందున ఈ వంట పద్ధతిని చూసేందుకు ప్రజలు తరలివస్తారు. ఛెత్రీ భోజనం తినడానికి కస్టమర్లు క్యూ కడుతుంటారు.

Tags

Read MoreRead Less
Next Story