Viral Video: డాక్టర్ వృత్తిలో ఉండి.. మూగజీవిని అమానుషంగా..

Viral Video: డాక్టర్ వృత్తిలో ఉండి.. మూగజీవిని అమానుషంగా..
Viral Video: మనిషన్నాక కాస్తైనా మానవత్వం ఉండాలి. అందునా వైద్య వృత్తిలో ఉన్న వారిని దేవుడిగా భావించే సమాజం మనది. కానీ ఆ వైద్య వృత్తికే కళంకం తెచ్చే విధంగా ప్రవర్తించాడు ఓ డాక్టర్..

Viral Video: మనిషన్నాక కాస్తైనా మానవత్వం ఉండాలి. అందునా వైద్య వృత్తిలో ఉన్న వారిని దేవుడిగా భావించే సమాజం మనది. కానీ ఆ వైద్య వృత్తికే కళంకం తెచ్చే విధంగా ప్రవర్తించాడు ఓ డాక్టర్..శునకాన్ని తాడుతో కారుకు కట్టేసి వేగంగా పోనిస్తున్నాడు.. అదేం పని అని అన్నవాళ్లని కూడా లెక్క చేయలేదు.. అతడి దుశ్చర్యని కొందరు బలవంతంగా అడ్డుకుని శునకానికి విముక్తి కలిగించారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది.

ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ రజనీష్ గాల్వా తన కారుకు వీధికుక్కను కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లాడన్న ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, శునకం కారు వేగానికి తట్టుకోలేక అటు ఇటు పరిగెడుతోంది. ఓ పక్క ట్రాఫిక్, మరో పక్క కారు వేగం.. పాపం ఆ మూగ జీవి ఎంతగా తల్లడిల్లిపోయి ఉంటుందో.. కారు వేగానికి శునకానకి ఒక కాలుకు ఫ్రాక్చర్ కాగా, మరో కాలుకు గాయాలయ్యాయి.

మెడకు కట్టిన తాడుతో లాగడం వలన మెడపై కూడా గాయాలు అయ్యాయని డాగ్ హోమ్ ఫౌండేషన్ కేర్‌టేకర్ తెలిపారు. డాక్టర్ రజనీష్ గాల్వాపై కేసు నమోదు చేశారు. 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని గాల్వాకు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు ఎస్ఎన్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ అండ్ కంట్రోలర్ డాక్టర్ దిలీప్ కచావాహ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story