Dorito chip: వింతకే వింత.. ఒక్క ఆలూ చిప్‌ రూ.14 లక్షలు..

Dorito chip: వింతకే వింత.. ఒక్క ఆలూ చిప్‌ రూ.14 లక్షలు..
ఓ చిప్ వెరైటీగా కనిపించింది. అస్సలు కొరకాలనిపించలేదు. వెంటనే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Dorito chip: పదమూడేళ్ల అమ్మాయిని పనీ పాట లేదని అమ్మ తిడుతున్నా అస్సలు పట్టించుకోకుండా ఆలూ చిప్స్ తింటూ టైమ్ పాస్ చేస్తోంది. అందులో ఓ చిప్ వెరైటీగా కనిపించింది. అస్సలు కొరకాలనిపించలేదు. బుర్రకో ఐడియా తట్టింది. వెంటనే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేయడంతో దాన్ని వేలం వేయమంటూ చాలా మంది సలహా ఇచ్చారు ఆ అమ్మాయికి. ఆశ్చర్యకరంగా ఒక్క ఆలూ చిప్‌కి ఆమెకి ఏకంగా రూ.14 లక్షలు వచ్చాయి.

నమ్మశక్యంగా లేని ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. ఇక్కడి గోల్డ్ కోస్ట్‌కి చెందిన 13 ఏళ్ల బాలిక రైలీ స్టువార్ట్‌కు బంగాళదుంప చిప్స్ తినడం అంటే మహా ఇష్టం. అందులోనూ ప్రముఖ బ్రాండ్ డోరిటోస్ ఆలూ చిప్స్ అంటే మరీ ఇష్టం. చిప్స్ తింటూ రుచిని ఆస్వాదిస్తున్న రైలీకి ఓ చిప్ సమోసాలాగా ఉబ్బినట్లు కనిపించింది. భలే ఉంది ముద్దుగా అనుకుని ఫ్రెండ్స్‌కి షేర్ చేసింది. దాచుకుందామనుకుంటే వాళ్లు దాన్ని వేలం వేయమని సలహా ఇచ్చారు.

ఈ వీడియో వైరల్ అయ్యి ట్విట్టర్, ఫేస్‌బుక్‌లోనూ షేర్ అయ్యింది. దీంతో మిలియన్ల వ్యూస్.. రైలీకి ఏం అర్థం కాలేదు. అవునా ఈ ఆలూ చిప్‌కి ఇంత డిమాండ్ ఉందా అనుకుంది. ఈబే సైట్‌లో లిస్ట్ చేసింది. చిప్ విలువ డాలర్ కంటే తక్కువే కోట్ చేసింది. కానీ ఆమె ఊహించని విధంగా దాని విలువ గంటల వ్యవధిలో 2వేల డాలర్లకు చేరుకుంది.

ఎవరో ఎందుకు దాన్ని కొనడం అని డోరిటోస్ కంపెనీనే ముందుకు వచ్చి 13 ఏళ్ల రైలీకి రూ.14 లక్షలు ఇచ్చి కొనుగోలు చేసింది. అంత ధర ఎందుకు పెట్టడం అంటే ఆ ఇంటి వాళ్లు మా చిప్స్ బాగా తింటారు అని బదులిచ్చింది. సో.. అదృష్టం ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరికీ అర్థం కాదు. ప్రస్తుతం ఏ న్యూస్ వైరల్ అవుతుందో ఎవరికీ తెలియదు. అదన్నమాట సంగతి.

Tags

Read MoreRead Less
Next Story