ఇన్ స్టా రీలా.. పనేంలేదా: పోలీసుల చేతిలో చీవాట్లు, ఫైన్

ఇన్ స్టా రీలా.. పనేంలేదా: పోలీసుల చేతిలో చీవాట్లు, ఫైన్
ఏదో ఒకటి చేయడం.. యూట్యూబ్ లో, ఇన్ స్టాలో పోస్ట్ చేయడం.. వాటికి లైకులు ఎంత మంది చేశారు..

ఏదో ఒకటి చేయడం.. యూట్యూబ్ లో, ఇన్ స్టాలో పోస్ట్ చేయడం.. వాటికి లైకులు ఎంత మంది చేశారు.. ఏం కామెంట్ చేశారు.. ఎన్ని వ్యూస్ వచ్చాయి.. పొద్దున్న లేస్తే ఇదే పని కొంతమందికి.. టెక్నాలజీ మంచికి ఉపయోగించుకుంటే చాలా మేలు చేస్తుంది. ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి.. ఎంతో నేర్చుకోవచ్చు. కానీ ఇలాంటి పిచ్చి ఫీట్లు చేసి పోలీసుల చేతిలో అడ్డంగా బుక్కయ్యేవారు కొందరు ఉంటారు.. వాళ్లకి పనీపాడు లేక ఇలాంటి చెత్త పనులు చేస్తుంటారు.. ఒక్కోసారి నెటిజన్ల చేతిలో చీవాట్లు తింటారు. అయినా వీళ్లు మారరు.

యూట్యూబ్ వీడియోల కోసం ప్రాణాలు సైతం పోగొట్టుకున్న వారిని చూసైనా వీళ్లకి బుద్దిరాదు.. పట్టు తప్పితే పరలోకానికే అన్న ఇంగిత జ్ఞానం ఇసుమంతైనా ఉండదు. తాజాగా ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఓ యువతి హైవేపై వెళుతున్న కారు బానెట్ పై కూర్చుని ఇన్ స్టా రీల్ చేసింది. ప్రయాగరాజ్ జిల్లాలోని సివిల్ లైన్ ఏరియాకు చెందిన వర్ణిక కారు బ్యానెట్ పై కూర్చుని ఓ పాటకు రీల్ చేసింది. పెళ్లి కుమార్తెలా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది. షూట్ చేసిన ఈ రీల్ ను తన ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. దీంతో పోలీసులు ఆమెకు షాకిచ్చారు. వీడియోలో కనిపించిన వాహనం నెంబర్ ఆధారంగా యువతిని గుర్తించి హెచ్చరించారు. రూ.15,500 జరిమానా విధించి మరోసారి రోడ్డు మీద ఇలాంటి సర్కస్ ఫీట్లు చేసారంటే ఈసారి అరెస్టే అని వార్నింగ్ ఇచ్చి పంపించారు.

Tags

Read MoreRead Less
Next Story