ఫన్నీ వీడియో: గేదెపై బుడ్డోడి స్నానం..సెహ్వాగ్ సరదా కామెంట్స్

Virender Sehwag: వీరేంద్ర సెహ్వాగ్ వీడియోను పోస్ట్ చేసిన ఈ వీడియో ఆయన అభిమానులను ఎంతగానో అలరిస్తున్నది.

ఫన్నీ వీడియో: గేదెపై బుడ్డోడి స్నానం..సెహ్వాగ్ సరదా కామెంట్స్
X

స్మార్ట్ ఫోన్ యుగంలో ప్రపంచంలో ఏదీ జరిగిన ఓ వింతలానే కనిపిస్తుంది. దాంతో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసుంటారు నెటిజన్లు. రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇప్పుడో వీడియో నెటింట్లో తెగ చక్కర్లు కొడుతుంది. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆ వీడియోను షేర్ చేశారు. సోషల్ మీడియాలో సెహ్వాగ్ యాక్టీవ్‌గా ఉంటున్నాడు. ఎప్పటికప్పుడు సరదా కామెంట్స్‌, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

ఇక తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ వీడియోను పోస్ట్ చేసిన ఈ వీడియో ఆయన అభిమానులను ఎంతగానో అలరిస్తున్నది. ఈ వీడియోలో ఒక పిల్లవాడు గెదెపైన పైపుతో స్నానం చేయిస్తూ.. తానూ స్నానం చేస్తూ ఆ ఎంజాయ్‌మెంట్‌ను ఆస్వాదిస్తున్నాడు. పిల్లవాడు బర్రెపైన నిలబడి, కొన్నిసార్లు కూర్చొని, మరోసారి పడుకుని నీళ్లు పోస్తూ కనిపిస్తాడు. వీడియో షేర్ చేసిన సెహ్వాగ్.. గ్రామాల్లో జీవితం ఇలా స‌ర‌దాగా గ‌డిచిపోతుంటుంద‌ని, న‌గ‌రాల్లో ఉన్నవారికి ఇటువంటి స‌ర‌దాల గురించి తెలియ‌ద‌ని క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియో బ్యాక్‌డ్రాప్‌లో ఓ బాలీవుడ్ పాటను యడ్ చేశారు. ఆ పాటకు, ఆ బుడ్డోడి డ్యాన్స్‌ సింక్ అవడంతో.. ఆ వీడియో నెట్టింట్లో ఓ రేంజ్‌లో పేలుతుంది.Next Story

RELATED STORIES