మెక్సికోలో ఘోర రోడ్డుప్రమాదం.. 13 మంది మృతి

మెక్సికోలో ఘోర రోడ్డుప్రమాదం.. 13 మంది మృతి
మెక్సికోలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. లా ట్రినిటారియా, ఫ్రంటెరా కోమాలపా రహదారిపై ఓ బస్పు అదుపుతప్పి గోడను ఢీ కొట్టింది.

మెక్సికోలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. లా ట్రినిటారియా, ఫ్రంటెరా కోమాలపా రహదారిపై ఓ బస్పు అదుపుతప్పి గోడను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. మృతుల్లో 5 మహిళలు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. వీరితోపాటు మరో 13 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసుల నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో తేలింది.

Tags

Read MoreRead Less
Next Story