Indians Returned : హమ్మయ్య వచ్చేసారు ...

Indians Returned : హమ్మయ్య వచ్చేసారు ...
ఇజ్రాయెల్ నుంచి భారతీయులు సురక్షితంగా స్వదేశానికి..

ఇజ్రాయెల్‌ దేశంలో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి మొదటి చార్టర్ విమానం గురువారం రాత్రి టెల్ అవివ్ లోని బెన్ గురియన్ విమానాశ్రయం నుంచి బయలుదేరి శుక్రవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది. ఈ విమానంలో 212 మంది ఇండియన్స్ తిరిగి స్వదేశానికి వచ్చారు. వారికి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఎయిర్ పోర్ట్ లో స్వాగతం పలికారు.

ఇజ్రాయెల్ – హమాస్ మధ్య యుద్ధంతో అంశాంతి వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్‌లో సుమారు 18వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. ‘ఆపరేషన్ అజయ్’పై భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యారు. ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయుల్లో విద్యార్థులే అధికంగా ఉన్నారు. వైద్యం, వ్యవసాయం, టెక్నాలజీ తదితర రంగాల్లో విద్యాభ్యాసం, పరిశోధనల కోసం భారతీయులు ఇజ్రాయెల్‌ వెళ్లారు. ఇజ్రాయెల్‌ నుంచి తొలి విమానంలో వచ్చిన భారతీయులు టెల్ అవీవ్, హైఫా నగరాల్లో నివసిస్తున్నారు.


అయితే ఆపరేషన్ అజయ్ పేరుతో వారిని తిరిగి రప్పించే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇజ్రాయెల్, గాజాల పరస్పర రాకెట్ల దాడులతో 2 వేల 500 మంది చనిపోయారు. 5 వేలకు పైగా గాయపడ్డారు. "మేము ఇజ్రాయెల్ లో ఇలాంటి పరిస్థితిని చూడటం ఇదే తొలిసారి. మమ్మల్ని తిరిగి తీసుకువచ్చినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు. యుద్ధ భయాలు త్వరగా తొలగిపోతాయని ఆశిస్తున్నాం. తద్వారా మేము అక్కడికి తిరిగి వెళ్ళగలం" అని ఓ ప్రయాణికుడు తన అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు. తమనుతమను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చిన భారత ప్రభుత్వానికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో భారతీయులు ఉన్నా.. కేంద్ర సర్కార్ వాళ్లను వదిలిపెట్టదని.. సురక్షితంగా భరతభూమికి తీసుకువస్తుందని కేంద్ర మంత్రి రాజీవ్​ చంద్రశేఖర్ అన్నారు.

స్వదేశానికి తిరిగి రావాలనుకునే భారతీయులకు వీలుగా ఆపరేషన్ అజయ్‌ను ప్రారంభించినట్లు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ బుధవారం ప్రకటించారు. ఇజ్రాయెల్-హమాస్​ మధ్య నెలకొన్న భీకర యుద్ధంలో ప్రాణాలతో ఉంటామో లేదోనని భయంతో గడిపిన భారతీయులు స్వదేశానికి తరలిరావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా ఇజ్రాయిల్‌లో నివసిస్తున్న మన భారతీయ పౌరులు త్వరలో రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలని marosaariవిజ్ఞప్తి చేస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story