కరోనా నుంచి కోలుకున్న వారిలో 90శాతం మందికి పైగా సైడ్ ఎఫెక్ట్స్

కరోనా నుంచి కోలుకున్న వారిలో 90శాతం మందికి పైగా సైడ్ ఎఫెక్ట్స్
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అన్ని వర్గాలవారిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అన్ని వర్గాలవారిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి చాలా మంది పరిశోదనలు చేశారు. తాజాగా ఓ పరిశోధనలో వెలువడిన ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా నుంచి కోలుకుంటున్న వారిలో 90శాతం మందిలో ఈ మహమ్మారి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయని తేలింది. దక్షిణ కొరియాలో నిర్వహించిన ఒక ప్రాథమిక అధ్యయనంలో 90శాతం మందిలో అలసట, మానసిక అలజడి, వాసన, రుచి కోల్పోవడం లాంటి దుష్ప్రభావాలను ఎదుర్కొంటున్నారని తేలింది. కరోనా నుంచి కోలుకున్న 965 మందిని ప్రశ్నించగా.. 879 మంది(91.1 శాతం) సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొంటున్నామని తెలిపారు.

ఈ పరిశోదన చేసిన ఓ అధికారి మాట్లాడుతూ.. 26.2 శాతం మందిలో అలసట, ఏకాగ్రత లోపించడంలాంటి లక్షణాలు కనిపించాయని.. 24.6 శాతం మంది తాము దేనిపై కూడా తగినంత దృష్టి పెట్టలేకపోతున్నామని తెలిపినట్టు చెప్పారు. మరికొంతమందిలో మానసిక అలజడి, రుచి, వాసన కోల్పోవడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు.

Tags

Read MoreRead Less
Next Story