Indian teen missing in US: నాన్న ఉద్యోగం పోతుందేమోనన్న భయంతో.. స్కూల్‌కి వెళ్లిన బాలిక

Indian teen missing in US: నాన్న ఉద్యోగం పోతుందేమోనన్న భయంతో.. స్కూల్‌కి వెళ్లిన బాలిక
Indian teen missing in US: 14 ఏళ్ల భారతీయ-అమెరికన్ పాఠశాల బాలిక తప్పిపోయింది. టెక్ పరిశ్రమలో తొలగింపుల మధ్య ఆమె తండ్రి ఉద్యోగం పోతుందేమోని ఆందోళన చెందింది

Indian teen missing in US: 14 ఏళ్ల భారతీయ-అమెరికన్ పాఠశాల బాలిక తప్పిపోయింది. టెక్ పరిశ్రమలో తొలగింపుల మధ్య ఆమె తండ్రి ఉద్యోగం పోతుందేమోని ఆందోళన చెందింది. దాంతో అమెరికాను విడిచిపెట్టాల్సి వస్తుందనే భయంతో ఆమె పారిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

యుఎస్ ఆర్కాన్సాస్ రాష్ట్రంలో భారతీయ-అమెరికన్ పాఠశాల బాలిక అదృశ్యమైంది. అర్కాన్సాస్‌లోని కాన్వేకి చెందిన తన్వి మరుపల్లి తల్లిదండ్రులు చట్టబద్ధంగా అనేక సంవత్సరాలు యుఎస్‌లో నివసిస్తున్నారు. పౌరసత్వం పొందాలని ప్రయత్నిస్తున్నప్పటికీ సాధ్యం కావడం లేదు.

నివేదికల ప్రకారం, ఆమె తల్లి శ్రీదేవి ఈదర కూడా ఉద్యోగం కోల్పోయింది. ఆమె ఒంటరిగా భారతదేశానికి తిరిగి వచ్చి వీసా కోసం మళ్లీ దరఖాస్తు చేయాల్సి వచ్చింది.తన వర్క్ వీసా పోతే ఏం చేస్తారని కూతురు అడిగిన ప్రశ్నకు, భయపడవద్దని తండ్రి పవన్ చెప్పాడు.

పోలీసులు తన్వీ కోసం వెతుకుతూనే ఉన్నారు. ఆమెను కనుగొన్న వారికి తన్వీ కుటుంబం USD 5,000 బహుమతిని అందిస్తామని తెలిపింది.

ది వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం, గత ఏడాది నవంబర్ నుండి దాదాపు 200,000 మంది ఐటి ఉద్యోగులు తొలగించబడ్డారు. ఇందులో గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా ఉన్నాయి.వారిలో 30 నుండి 40 శాతం భారతీయ IT నిపుణులు ఉన్నారు. వీరిలో అధిక సంఖ్యాకులు H-1B మరియు L1 వీసాలపై ఉన్నారు.

LayoffTracker.com ప్రకారం, జనవరి 2023లో 91,000 మందిని తొలగించారు. రాబోయే నెలల్లో ఈ సంఖ్య మరింత పెరగవచ్చు. ఇది వారి కుటుంబాలపై, ప్రత్యేకించి గ్రేస్ పీరియడ్ దాటి 10 రోజులలోపు వెంటనే US నుండి నిష్క్రమించాల్సిన H-1B హోల్డర్‌లపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

Tags

Read MoreRead Less
Next Story