అంతర్జాతీయం

విధి విలాపం: ఒకప్పుడు మంత్రి.. ఇప్పుడు పిజ్జా డెలివరీ బాయ్

ఏడాది క్రితం ఆ దేశానికి ఐటీ మంత్రిగా గౌరవస్థానాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు పిజ్జా డెలివరీ బాయ్‌గా వీధుల్లో తిరుగుతున్నాడు.

విధి విలాపం: ఒకప్పుడు మంత్రి.. ఇప్పుడు పిజ్జా డెలివరీ బాయ్
X

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవడం అంటే ఇదే. ఏ రోజు ఎలా ఉంటుందో.. ఎవరి పరిస్థితి ఏ విధంగా మారుతుందో ఊహించడం చాలా కష్టం. ఏడాది క్రితం ఆ దేశానికి ఐటీ మంత్రిగా గౌరవస్థానాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు పిజ్జా డెలివరీ బాయ్‌గా వీధుల్లో తిరుగుతున్నాడు.

సయ్యద్ అహ్మద్ షా సాదత్ ఆఫ్ఘనిస్తాన్‌లో కమ్యూనికేషన్స్ మరియు ఐటి మంత్రిగా గౌరవనీయమైన స్థానాన్ని పొందారు. అయితే, ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో విభేదాల కారణంగా, అతను 2020 లో తన దేశాన్ని విడిచిపెట్టి జర్మనీలో స్థిరపడ్డాడు. సాదత్ ఇప్పుడు జర్మనీలోని లీప్‌జిగ్ నగరంలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు.

జర్మనీలో స్థిరపడిన తరువాత, అతడి దగ్గర ఉన్న డబ్బు కొన్ని నెలల్లో అయిపోయింది. జీవనం కోసం పిజ్జా డెలివరీ బాయ్‌గా పని చేయవలసి వచ్చింది. ఇప్పుడు అతను తన సైకిల్‌పై నగర వీధుల్లో తిరుగుతూ, ఆర్డర్ చేసిన వారికి ఆహారాన్ని అందిస్తున్నాడు.

Next Story

RELATED STORIES