అణుదాడిని ఆపిన భారత్.. అమెరికా ప్రశంసలు

అణుదాడిని ఆపిన భారత్.. అమెరికా ప్రశంసలు

భారతదేశం శాంతికాముక దేశం అనేది ఇప్పుడు ప్రపంచం మొత్తం ఘోషిస్తోంది. యుక్రెయిన్ దేశంలో రష్యా అణుబాంబును కూడా భారత్ ఆపగలిగింది అనేది ఇపుడు ప్రపంచ అగ్ర దేశాల మాట. యుక్రెయిన్ పై రష్యా అణుదాడికి కూడా సిద్ధపడింది అప్పట్లో. అయితే అణుదాడికి పాల్పడితే ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపై అమెరికా 2022లోనే పూర్తి స్థాయి కసరత్తు చేసిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ కార్యవర్గానికి చెందిన ఇద్దరు అధికారులు ఓ ఇంగ్లీష్ మీడియాకు వెల్లడించారు.

అణుసంక్షోభ నివారణకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు చైనా అధినేత చేసిన ప్రకటనలు, అందించిన సహకారం ముఖ్యపాత్ర పోషించాయని అమెరికా తన నివేదికలో తెలిపింది. ఖేర్సాన్‌లో రష్యా ఎదురు దెబ్బలు తింటున్న వేళ అణుదాడి జరగవచ్చని వాషింగ్టన్‌ అనుకుందట. ఈ ప్రాంతాన్ని తమ భూభాగంలోనిదిగా అప్పటికే మాస్కో ప్రకటించడం వల్ల పుతిన్‌ ఈ దాడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారని భావించిందట.

రష్యా అణుదాడికి పాల్పడకుండా నచ్చజెప్పేందుకు అమెరికా.. భారత్‌, చైనా దేశాల సాయం కోరింది. నేరుగా మాస్కోను ఓ వైపు హెచ్చరిస్తూనే.. మరోవైపు ఇతర దేశాలతో కూడా దానిపై అమెరికా ఒత్తిడి తెచ్చిందట. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటనలు సంక్షోభాన్ని తీవ్రతరం కాకుండా ఆపగలిగాయని యూఎస్ అధికారులు తమ నివేదికలో తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story