Arizona : అమ్మతనానికి కళంకం... ఆరేళ్ల కొడుకుని ఆకలికి మాడ్చి...

Arizona : అమ్మతనానికి కళంకం... ఆరేళ్ల కొడుకుని ఆకలికి మాడ్చి...
దొంగతనం నెపంతో చిన్న గదిలో కొన్ని రోజులపాటు బంధించిన తల్లి

కన్న కొడుకుకి పనిష్మెంట్ పేరుతో బంధించి తిండిలేకుండా చేసిన తల్లిపై అరిజోనాలో ఒక కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది . నేరాన్ని అంగీకరించినప్పటికీ కోర్టు ఆమెకు పెరోల్ అవకాశం లేకుండా జీవిత ఖైదు విధించింది. ఆమె తన కుమారుడిని మూత్రంతో తడిసిన గదిలో బంధించినందుకు న్యాయమూర్తి ఆమె చర్యలను క్రూరమైన, నీచమైనవిగా పేర్కొన్నారు.

పిల్లలు అన్నాక తప్పులు చేస్తారు కానీ తల్లిదండ్రులు వాటిని చూసి ఏదో కాస్త శిక్షించి, అలాంటి వాటిని మరొకసారి చేయద్దు అని పిల్లలకు నచ్చ చెప్పడమే సరైన పెంపకం. అసలు శిక్షించకుండా కూడా పిల్లలకు చెప్పొచ్చు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో శిక్షించటాన్ని కూడా పెద్దగా తప్పుపట్టలేము. ఇరవై తొమ్మిదేళ్ల ఎలిజబెత్ ఆర్చిబెక్ 2020లో తన కొడుకును చేజేతులా చనిపోయేలా చేసింది.. కేవలం 18 పౌండ్లు బరువున్న ఆరేళ్ళ దేశాన్ మార్టినెజ్ ఒక రోజు బాత్రూంలో చనిపోయి ఎముకల గూడులా కనపడ్డాడని ఈ కేసులో పోలీసులు సాక్ష్యం చెప్పారు . ముందుగా తమ ఎమర్జెన్సీ నెంబర్ కు తన మనవడు స్పందించడం లేదంటూ ఓ మహిళ ఫోన్ చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు. బాలుడు తీవ్రమైన ఆకలితో ప్రాణాలు కోల్పోయినట్లు వారు తెలుసుకున్నారు.

బాలుడు 2 రోజుల క్రితం ఆహారాన్ని దొంగిలించిన కారణంగా అతనిని, అతని అన్నను అతి చిన్న అల్మారాలో బంధించి వదిలేసింది ఆ తల్లి. తినటానికి తిండి లేక బాత్ రూమ్ కి వెళ్లే అవకాశం లేక పిల్లలు ఇద్దరు కొన్ని రోజులు పాటు అందులోనే మగ్గిపోయారు. తర్వాత చిన్న పిల్లవాడు చనిపోయాడు అంటూ పిల్లాడి అమ్మమ్మ పోలీసులకు సమాచారం అందించింది. నిందితులుగా కుటుంబ సభ్యులు అందరినీ గుర్తించినప్పటికీ, విచారణలో ప్రముఖ పాత్ర తల్లిదేనని తేలింది. అంతే కాదు ఆ తల్లి కూడా తాను తప్పు చేశానని అంగీకరించింది. 2020, మార్చి 2 న ఈ సంఘటన జరగగా కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.

Tags

Read MoreRead Less
Next Story