Belgium : ఆహా! ఎంత మంచి బాసు.. వారానికి 4 రోజులే ఆఫీసు

Belgium : ఆహా! ఎంత మంచి బాసు.. వారానికి 4 రోజులే ఆఫీసు
Belgium : అయితే ప్రతి రోజు తొమ్మిదిన్నర గంటలు కచ్చితంగా పని చేయాలి.

Belgium: సోమవారం నుంచి మొదలు మళ్లీ ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు ఉద్యోగులు.. ఆటవిడుపు ఆదివారమే కావడంతో ఆ రోజు ఎన్నో పనులు.. మరెన్నో ప్లాన్లు.. అట్టే గడిచిపోతుంది ఆదివారం.. ఉన్న ఒక్క రోజు అయిపోయింది అని ఉసూరుమంటారు ఉద్యోగులు.. మరి ఏడు రోజుల వీక్‌లో మూడు రోజులు శెలవులైతే ఉషారుగా పని చేస్తారని భావించింది బెల్జియం ప్రభుత్వం.


ఆ దేశ ప్రధాని అలెగ్జాండర్ మంగళవారం లేబర్ మార్కెట్ రిఫామ్స్ పేరిట కొత్త చట్టాన్ని అమలు చేశారు. ఉద్యోగులకు వారానికి నాలుగు రోజులే పని రోజులు. అయితే ప్రతిరోజు తొమ్మిదిన్నర గంటలు కచ్చితంగా పని చేయాలి. మిగతా రోజులు ఆఫీసు ఊసే లేదు.. మెసేజ్‌లు, ఫోన్‌లు ఏవీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు.. బాస్‌ నుంచి అర్జంట్ కాల్ అసలే రాదు.

హ్యాపీగా మీ సొంత పనులకు ఆ మూడు రోజులు వాడుకోవచ్చు.. ఆ కంపెనీలో పని చేసే ఉద్యోగుల సంఖ్య 20 మంది కంటే ఎక్కువ వుంటేనే ఈ చట్టం వర్తిస్తుంది అని ప్రధాని జీవో జారీ చేశారు. ఆర్థికంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న బెల్జియం దేశానికి ఈ చట్టం కొత్త ఉత్సాహాన్ని, ఆర్థిక పురోగతిని తీసుకు వస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


బెల్జియం మరింత వినూత్నమైన, స్థిరమైన మరియు డిజిటల్ ఆర్థిక వ్యవస్థను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని గుర్తించింది. ఆరు నెలల వ్యవధి తర్వాత, ఉద్యోగి ఏ విధమైన ప్రతికూల పరిణామాలు లేకుండా ఈ విధానాన్ని కొనసాగించవచ్చు లేదా ఐదు రోజుల పని దినాలను ఎంచుకోవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story