Nijjar killing: నిజ్జర్‌ హత్య కేసులో ఇద్దరు అనుమానితులు..

Nijjar killing: నిజ్జర్‌ హత్య కేసులో ఇద్దరు అనుమానితులు..

కెనడా లో ఖలిస్థాన్‌ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఖలిస్థాన్‌ తీవ్రవాది హత్య కేసులో ఇద్దరు అనుమానితుల్ని కెనడా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఆ ఇద్దరినీ పోలీసులు అతి తర్వలోనే అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.

నిజ్జర్‌ హత్యతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఇద్దరు అనుమానితులపై గత కొన్ని నెలలుగా కెనడా పోలీసులు గట్టి నిఘా పెట్టినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. ఈ హత్య తర్వాత వారు కెనడా విడిచి ఎక్కడికీ పారిపోలేదని.. కొన్ని వారాల్లోనే ఇద్దరు అనుమానితుల్ని అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు సదరు కథనాలు వెల్లడించాయి.

భారత ప్రభుత్వం ‘వాంటెడ్ టెర్రరిస్ట్’ గా ప్రకటించిన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ఈ ఏడాది జూన్‌ 18వ తేదీన దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. కెనడా లోని సర్రే లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో హర్దీప్ మరణించాడు. ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ సభ్యులకు కార్యకలాపాల నిర్వహణ, నెట్ వర్క్ ఏర్పాటు చేయడం, శిక్షణ, ఆర్థిక సహకారం వంటివి హర్దీప్ చేస్తుంటాడు. పలు భారత వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న హర్దీప్ ను కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఉగ్రవాదిగా ప్రకటించింది. అయితే, నిజ్జర్‌ హత్య వెను భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ఆరోపిస్తోంది. ఈ మేరకు భారత్‌పై కెనడాప్రధాని జస్టిన్‌ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.అయితే, కెనడా ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. మరోవైపు ట్రూడో ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

భారత ప్రభుత్వం విడుదల చేసిన 40మంది టెర్రరిస్టుల జాబితాలో చేర్చబడిన హర్దీప్ సింగ్ నిజ్జర్ గురుద్వారా పార్కింగ్ స్థలంలో కారులో బుల్లెట్ గాయాలతో చనిపోయాడు. సెప్టెంబరులో కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్య వివాదం రాజుకుంది.ట్రూడో వ్యాఖ్యలను భారత్‌ తీవ్రంగా ఖండించింది.

ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు కుట్ర కేసులో ఓ భారతీయుడిని తమకు అప్పగించాలని అగ్రరాజ్యం ఒత్తిడిచేస్తున్న ఈ సమయంలో నిజ్జర్‌ హత్య కేసులో అనుమానితులను అరెస్టు చేసేందుకు కెనడా పోలీసులు సిద్ధమవడం ప్రాధాన్యం సంతరించుకుంది.


Tags

Read MoreRead Less
Next Story