Justin Trudeau: ట్రూడో పై కెనడా విపక్ష నేత ధ్వజం

Justin Trudeau: ట్రూడో పై  కెనడా విపక్ష నేత ధ్వజం
భారత్ లో లాఫింగ్ స్టారగా మారారంటూ విమర్శలు

భారత్‌పై నిరంతరం అక్కసు వెళ్లగక్కుతూ కెనడా ప్రధాని తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేస్తునే ఉన్నారు. ఈ క్రమంలోనే జస్టిన్ ట్రూడో‌పై భారత్ నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తాజాగా కెనడాలోని ప్రతిపక్ష నేత.. భారత్, కెనడా మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులపై స్పందించారు. ఈ నేపథ్యంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జస్టిన్ ట్రూడోను చూసి భారతీయులు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

కెనడాలో ప్రతిపక్ష నేత, కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పియరీ పొయిలీవ్రే.. కెనడా ప్రధాని జస్టిన ట్రూడోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, కెనడా మధ్య దౌత్య వివాదానికి ట్రూడోపై నిందలు వేశారు. భారత్‌లో జస్టిన్ ట్రూడోని చూసి నవ్వుకుంటున్నారని.. భారత్‌లో ఆయన లాఫింగ్ స్టాక్‌గా మారారని పియరీ తీవ్ర ఆరోపణలు చేశారు. నేపాల్ మీడియా సంస్థ నమస్తే రేడియో టొరంటోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పియరీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్యమని పేర్కొన్నారు.


నేపాల్ మీడియా సంస్థ నమస్తే రేడియో టోరంటోకు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను కెనడా దౌత్యవేత్తలు విడిచిపెట్టాలని ట్రూడో పిలుపునివ్వడంపై అడగ్గా, ఆయన అసమర్ధ ప్రధాని అని ఆరోపించారు. భారత్‌తోసహా ప్రపంచ దేశాలు దాదాపు ప్రతిదేశం తోనూ కెనడా సంబంధాలను దెబ్బతీశారని, ప్రతిదేశం తోనూ కెనడా ప్రధాన వివాదాలతో ఉంటోందని మండి పడ్డారు.

భారత్‌తో కొన్ని విభేదాలున్నా వాటికి జవాబుదారీగా నిలవడం మంచిదని, ముఖ్యంగా సత్సంబంధాలు కలిగి ఉండాలని సూచించారు. తాను ప్రధాని అయిన తర్వాత వీటిని పునరుద్ధరిస్తానని పియరీ పోలివ్రే పేర్కొన్నారు. కెనడా విదేశీ విధానంపై విమర్శలు గుప్పించిన పోలివ్రే , చైనా, అమెరికాల తీరుపై కూడా మండి పడ్డారు. స్థానికంగా రహస్యంగా పోలీస్ స్టేషన్లను తెరుస్తూ కెనడా అంతర్గత విషయాల్లో చైనా జోక్యం చేసుకుంటోందన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ట్రూడోను డోర్ మ్యాట్‌లా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. కెనడా లోని హిందూ దేవాలయాలపై దాడులు జరగడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.


Tags

Read MoreRead Less
Next Story