చైనాలో తుఫాను బీభత్సం.. 78కి చేరుకున్న మృతుల సంఖ్య

చైనాలో తుఫాను బీభత్సం.. 78కి చేరుకున్న మృతుల సంఖ్య
ఉత్తర చైనా అంతటా రికార్డు స్థాయిలో కురుస్తున్న వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య శుక్రవారం కనీసం 78కి పెరిగింది.

ఉత్తర చైనా అంతటా రికార్డు స్థాయిలో కురుస్తున్న వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య శుక్రవారం కనీసం 78కి పెరిగింది. రెండు వారాల క్రితం చైనా ప్రధాన భూభాగాన్ని టైఫూన్‌ తుఫాన్ తాకింది. డోక్సురి తుఫాను 140 సంవత్సరాల క్రితం రికార్డులను ఈ తుఫాను బద్దలు కొట్టింది.వాతావరణ మార్పుల వల్ల ఇటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.

రాజధానికి సరిహద్దుగా ఉన్న హెబీలోని కొన్ని ప్రాంతాల్లో వీధులు ఇప్పటికీ బురదలో ఉన్నాయి. నీటమునిగిన వస్తువులను వెలికితీయడానికి, దెబ్బతిన్న ఇళ్లను శుభ్రం చేయడానికి నివాసితులు కష్టపడుతున్నారు. బీజింగ్‌లో, ఇద్దరు రెస్క్యూ వర్కర్లతో సహా కనీసం 33 మంది మరణించారని అధికారులు తెలిపారు.

ఈశాన్య జిలిన్ ప్రావిన్స్‌లో గత వారం కుండపోత వర్షం కారణంగా డజను మందికి పైగా ప్రజలు మరణించారు. పొరుగున ఉన్న లియోనింగ్ ప్రావిన్స్‌లో, జూలై చివరలో తీవ్రమైన వర్షం కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఉష్ణమండల అల్పపీడనం ఖనున్ -- గతంలో టైఫూన్ -- చైనాను సమీపిస్తున్నందున వారాంతంలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర చైనా అంతటా అత్యవసర హెచ్చరిక స్థాయిలు కొనసాగుతున్నాయని, కీలకమైన నదీ మార్గాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story