కయ్యానికి కాలు దువ్వుతోన్న చైనా!

కయ్యానికి కాలు దువ్వుతోన్న చైనా!
చైనా తమ బలగాలను వెనక్కు తీసుకుంటే చర్చలు కొలిక్కి వస్తాయని భారత్‌ భావిస్తోంది.

చైనా తీరు మారడం లేదు.. ఓ వైపు చర్చలు అంటూనే కయ్యానికి కాలు దువ్వుతోంది.. లద్దాక్‌ తూర్పు ప్రాంతంలో ఉద్రిక్తతలు చల్లార్చేందుకు భారత్‌ ప్రయత్నిస్తుండగా.. చైనా మాత్రం షరుతులు పెడుతూ మోకాలు అడ్డుతోంది. ఇప్పటి వరకు భారత్‌, చైనా జరిపిన చర్చల్లో ఆశించినంత పురోగతి కనిపించడం లేదు. శాంతిస్థాపన దిశగా చేపట్టాల్సిన చర్యలపై ఓ పంచసూత్ర- ప్రణాళికను రెండు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం ఆమోదించినా.. తరువాత దానిపై చైనా క్లారిటీ ఇవ్వడం లేదు. ఓ రకంగా పీఎల్‌ఏ దళాల దుందుడుకు, కవ్వింపు పోకడలను చైనా విదేశాంగ మత్రి సమర్థించినట్టు సమాచారం.

ప్రస్తుతం సరిహద్దులో నెలకొన్న పరిస్థితి ఇరుదేశాలకూ శ్రేయస్కరం కాదని భారత్‌ అభిప్రాయపడుతోంది. చైనా తమ బలగాలను వెనక్కు తీసుకుంటే చర్చలు కొలిక్కి వస్తాయని భారత్‌ భావిస్తోంది. లద్దాఖ్‌ సరిహద్దుల్లో ఎందుకంత భారీగా దళాలను మోహరిస్తున్నారని విదేశాంగ మంత్రి జయశంకర్‌- వాంగ్‌ యీని ప్రశ్నించారు. పెద్ద సంఖ్యలో మోహరించడమేకాక- ఘర్షణకు ఆస్కారం కలిగించేలా అనేక ప్రాంతాల్లో స్థావరాలను కొత్తగా ఏర్పరచడమేంటని నిలదీశారు. దీనికి వాంగ్‌ యీ నుంచి సమాధానం రాలేదని తెలుస్తోంది. తిరిగి భారత్‌పై నిందలు వేయడానికి ప్రధాన్యమిచ్చినట్టు సమాచారం.

తూర్పు లద్దాఖ్‌లో పరిస్థితులు చేయిదాటుతున్న వేళ.. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌- త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌లతో భేటీ అయ్యారు. పరిస్థితిని సమీక్షించారు. బలగాలు సంఖ్య పెంచాలా, మరిన్ని ఫిరంగి దళాలు, ట్యాంకులూ తరలించాలా అన్నది చర్చించినట్లు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story