అంతర్జాతీయం

Covid-19: ఈ ఏడు లక్షణాలు ఉంటే కోవిడ్ సోకినట్లే..

Coronavirus: పరీక్ష సామర్థ్యం పరిమితంగా ఉన్నప్పుడు, లక్షణాలను గుర్తించి వేగంగా వైద్యం అందించడం చాలా ముఖ్యం.

Covid-19: ఈ ఏడు లక్షణాలు ఉంటే కోవిడ్ సోకినట్లే..
X

Covid: సమాజంలో SARS-CoV-2 సంక్రమణను వేగంగా గుర్తించడం అనేది చాలా కీలకం. పరీక్ష సామర్థ్యం పరిమితంగా ఉన్నప్పుడు, లక్షణాలను గుర్తించి వేగంగా వైద్యం అందించడం చాలా ముఖ్యం. కొత్త అధ్యయనం ప్రకారం.. పరిశోధకులు ఇంగ్లాండ్‌లోని 1,147,345 వాలంటీర్ల SARS-CoV-2 PCR పరీక్షలను గొంతు, ముక్కులలో చేశారు. 8 టెస్టింగ్ రౌండ్‌ల ద్వారా డేటా సేకరించారు. పరీక్షలో పాల్గొన్నవారిని ముందు వారంలో వారు అనుభవించిన లక్షణాల గురించి అడిగారు.

వాసన, రుచి కోల్పోవడం, జ్వరం, నిరంతర దగ్గు, చలి, ఆకలి మందగించడం, కండరాల నొప్పులు. వాటిలో మొదటి 4 లక్షణాలు ప్రస్తుతం UK లో కోవిడ్ వచ్చిందని నిర్ధారించడానికి ఉపయోగించబడుతున్నాయి.

కరోనా సోకినా కొందరిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదన్న విషయాన్ని మరవకూడదు అని పరిశోధకులు పేర్కొన్నారు. పబ్లిక్ లైబ్రరీ ఆఫ్ సైన్స్ మెడిసిన్ పత్రిక ఈ వివరాలను అందించింది.

Next Story

RELATED STORIES