అమ్మ దగ్గర పాలు తాగి.. నాన్న దగ్గర బజ్జుంటే ఎంత హాయి..

అమ్మ దగ్గర పాలు తాగి.. నాన్న దగ్గర బజ్జుంటే ఎంత హాయి..
చిన్నారుల ఆరోగ్యానికి తల్లి పాలు ఎంతో సురక్షితం. అలాగే కంటినిండా నిద్ర కూడా చిన్నారి ఆరోగ్యానికి ఎంతో మంచిది.

చిన్నారుల ఆరోగ్యానికి తల్లి పాలు ఎంతో సురక్షితం. అలాగే కంటినిండా నిద్ర కూడా చిన్నారి ఆరోగ్యానికి ఎంతో మంచిది. దానికి తండ్రి తోడ్పాడు ఎంతో అవసరం అని చెబుతున్నాయి సర్వేలు.

పీడియాట్రిక్స్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, తమ చిన్నారులకు తల్లి పాలు పట్టాలని కోరుకునే తండ్రులలో 95 శాతం మంది తమ మద్దతును తెలిపారు.

"చాలా కుటుంబాలు ఇంకా తల్లి పాల ఆవశ్యకతను గుర్తించడం లేదు. చిన్నారులకు తల్లి పాలివ్వడంలో తండ్రులు పోషించే ముఖ్యమైన పాత్రను నొక్కి చెప్పాలి అని అధ్యయనకారులు పేర్కొన్నారు.

USలో, ప్రతి సంవత్సరం నిద్ర-సంబంధిత కారణాల వల్ల 3,000 మంది శిశువులు మరణిస్తున్నారు. అధ్యయనం ప్రకారం, నల్లజాతి శిశువులలో శిశు మరణాల రేటు, తెల్ల శిశువుల కంటే రెండు రెట్లు ఎక్కువ అని తేలింది.

"తండ్రులు తమ శిశువుల కోసం అన్ని సురక్షితమైన నిద్ర పద్ధతులపై కౌన్సెలింగ్ తీసుకోవడం ఎంతో అవసరం అని పరిశోధకులు తెలిపారు. అమ్మ పాలిచ్చి పడుకోబెడితే, ఆ చిన్నారి హాయిగా నిద్ర పోవడానికి తండ్రి కారణమవ్వాలి అని చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story