బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 52 మంది మృతి..!
బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రాజధాని ఢాకా సమీపంలోని రూప్‌గంజ్‌లో ఓ జ్యూస్ తయారీ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
BY vamshikrishna9 July 2021 11:32 AM GMT

X
vamshikrishna9 July 2021 11:32 AM GMT
బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 52 మంది మృతి..! ఆరు అంతస్తుల భవనంలో జరిగిన ఈ ప్రమాదంలో సుమారు 52 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 50 మందికి పైగా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రాణాలు కాపాడుకునేందుకు ఎత్తైన భవనం నుంచి దూకడంతో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. కింది అంతస్తులో మొదలైన మంటలు వేగంగా పైఅంతస్తులకు వ్యాపించాయి. ఆ భవనంలో నిల్వ ఉంచిన ప్లాస్టిక్ బాటిళ్లు, రసాయనాల కారణంగా భారీగా మంటలు చెలరేగాయి. గురువారం సాయంత్రమే ఈ ప్రమాదం జరిగినప్పటికీ..మంటల్ని అదుపు చేసేందుకు చాలా సమయం పట్టింది. ఫ్యాక్టరీలో పనిచేసే చాలా మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దాదాపు 44 మందికిపైగా గల్లంతైనట్లు గుర్తించారు..ఘటనా స్థలిలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
Next Story
RELATED STORIES
Gyanavapi : జ్ఞానవాపి మసీదు-గుడి వివాదం.. ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ
20 May 2022 6:30 AM GMTLalu Prasad Yadav : లాలూ ప్రసాద్ యాదవ్పై మరో కొత్త కేసు
20 May 2022 3:53 AM GMTSatpal Maharaj : మంత్రినా మజాకా.. బాలీవుడ్ పోస్టర్లతో కోటు..!
19 May 2022 3:45 PM GMTNavjot Sidhu : నవజ్యోత్ సిద్ధూకు ఏడాది జైలు శిక్ష
19 May 2022 9:30 AM GMTMadhya Pradesh: రూ.11 కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చి.. భార్య, కొడుకుతో...
19 May 2022 8:09 AM GMTShocking News: నదిలో స్నానం చేస్తున్న వ్యక్తిని లాక్కెళ్లిన మొసలి..
19 May 2022 5:26 AM GMT