అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మొదటి డిబెట్

అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మొదటి డిబెట్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ట్రంప్, జో బిడెన్ మధ్య ముఖాముఖి ప్రారంభమైంది. ఎన్నికల్లో ఈ డిబెట్ అంత్యంత కీలకమైన

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ట్రంప్, జో బిడెన్ ల మధ్య ముఖాముఖి ప్రారంభమైంది. ఎన్నికల్లో ఈ డిబెట్ అంత్యంత కీలకమైన దశ. ఈ డిబేట్ లో గత ప్రభుత్వం పనితీరు, రానున్న కాలంలో తమ ప్రభుత్వాలు అమెరికా అభివృద్ధికి తీసుకొనే నిర్ణయాలు వీటన్నింటిపై చర్చ జరుగుతుంది. ఈ చర్చ 90 నిమిషాల పాటు జరగనుంది. ఇందులో ఒకరిపై ఒకరు విమర్శ ప్రతి విమర్శలు చేసుకుంటూ.. ఎవవరి సామర్థ్యాలు వారు చూపిస్తారు. ఇలా మొత్తం మూడు డిబెట్ లు జరగనున్నాయి. అమెరికా ఎన్నికల ప్రచారం మొత్తం ఒక ఎత్తు అయితే, ఈ మూడు డిబెట్లు మరో ఎత్తు 50శాతం ఈ చర్చలే అధ్యక్ష అబ్యర్థి సామర్థ్యాన్ని డిసైడ్ చేస్తాయి. అక్టోబర్ లో మరో రెండు చర్చలు జరగనున్నారు. ఓటర్లను బాగా ప్రభావితం చేసే ఈ మూడు డిబెట్ల తరువాత ఎన్నికల ఫలితాలను అంచనా వేసే సర్వేల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న డిబెట్ లో కరోనా కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పాటు, దేశంలోని వైద్య ఆరోగ్య రంగానికి చెందిన అంశాలుపై చర్చ జరుగుతుంది.

Tags

Read MoreRead Less
Next Story