Frances Haugen revealed : ఆమె లైవ్‌లోకి వచ్చి అసలు నిజం బయట పెట్టింది.. అందుకే ఫేస్‌బుక్ ఆగిపోయింది

Frances Haugen revealed : ఆమె లైవ్‌లోకి వచ్చి అసలు నిజం బయట పెట్టింది.. అందుకే ఫేస్‌బుక్ ఆగిపోయింది
Frances Haugen revealed : సంస్థకు లాభాలు కావాలి కానీ యూజర్ల భద్రత గురించి పట్టించుకోదని ఆమె ఆరోపించింది.

Frances Haugen revealed : ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్ పని చేయకపోతే ఇంకేమైనా ఉందా.. ప్రపంచం ఆగిపోదు.. ఒకటి, రెండూ కాదు.. ఏకంగా ఏడు గంటలు.. ఏమైందో అని ఎంత టెన్షనో ఒక్కొక్కరికీ.. ఆస్పత్రిలో ఐసీసీయూ బెడ్ మీద ఉన్న వారి గురించి కూడా అంత వర్రీ అయి ఉండరు. ఇన్‌స్టా రావట్లేదని ఇంట్లో కాలుగాలిన పిల్లిలా అటు తిరగడం.. దీంతో ఫేస్‌బుక్ జుకెర్ బర్గ్ అంతరాయానికి చింతిస్తున్నామంటూ క్షమాపణలు కూడా కోరవలసి వచ్చింది.

అవును ఇంతకీ ఎఫ్‌బీ ఎందుకు ఆగిపోయిందని ఆరా తీస్తే.. సంస్థలో జరుగుతున్న అక్రమాల గురించి మాజీ ఉద్యోగి ఓ మీడియా ఛానెల్ లైవ్‌లోకి వచ్చి అన్ని విషయాలు బయటపెట్టిందట. దీంతో ఆమె మాట్లాడిన కొన్ని గంటల వ్యవధిలోనే వీటి సేవలు నిలిచిపోయాయి.

ఆమె పేరు ఫ్రాన్సెస్ హాగెన్. గతంలో కూడా ఆమె సంస్థలో జరుగుతున్న అక్రమాలు వెల్లడించింది. సంస్థకు లాభాలు కావాలి కానీ యూజర్ల భద్రత గురించి పట్టించుకోదని ఆమె ఆరోపించింది.

తాను ఎన్నో సోషల్ మీడియా సైట్లను చూశానని, కానీ ఫేస్‌బుక్‌లో జరిగినట్లు మరెక్కడా జరగదని ఆమె చెప్పింది. దానికి సంబంధించిన అల్గారిథాన్ని మారిస్తే యూజర్లు తక్కువ సమయం సైట్‌పై ఉంటారని, దీంతో యాడ్ క్లిక్స్ తగ్గుతాయి, తద్వారా ఆదాయం కూడా తగ్గుతుంది.. అది సంస్థకు మింగుడు పడని అంశం. ఇన్‌స్టాగ్రామ్ టీనేజర్ల మానసిక ఆరోగ్యానికి మంచిది కాదని ఆమె నిరూపించడంతో, సంస్థ ఇన్‌స్టాగ్రామ్ కిడ్స్ లాంచింగ్‌ను ఆపేసింది.

అల్గారిథమ్ అంటే..

దేనిగురించైనా ఫేస్‌బుక్‌లో సెర్చ్ చేసినప్పడు పదే పదే అవే చూపిస్తుంటాయి. ఇది మంచిది కాదు అని హాగెన్ అంటారు. ఉదాహరణకు బరువు తగ్గడం గురించి వెతికితే.. ప్రతిసారి దానికి సంబంధించిన సమాచారం వస్తుంటుంది. ఆ ప్రభావానికై లోనే యువత ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా తమ అల్గారిథమ్స్ విద్వేష, హింసాత్మక సమాచారాన్ని ప్రోత్సహించిందని ఫేస్‌బుక్‌కు తెలుసు. అయినా వాటిని కట్టడి చేయలేదు. ఇలాంటి కంటెంట్‌ను ప్రమోట్ చేస్తే ట్రాఫిక్ పెరుగుతుందని ఫేస్‌బుక్‌కు తెలుస అని హాగెన్ వెల్లడించారు.

అయితే జుకెర్ ఇలాంటి సోషల్ మీడియాను నెలకొల్పాలని అనుకోలేదు. కానీ ఇలాంటి విద్వేష కంటెంట్‌ను ప్రోత్సహించే అవకాశాన్ని మాత్రం కల్పించారని హాగెన్ అంటున్నారు. ఈ విషయాలన్నింటినీ లైవ్‌లోకి వచ్చి చెప్పిన కొన్ని గంటల్లోనే ఫేస్‌బుక్ సేవలు నిలిచిపోయాయి.

Tags

Read MoreRead Less
Next Story