ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. నిద్రలోనే..

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. నిద్రలోనే..
రెండు నెలల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు.. గురువారం రాత్రి గుండెపోటుకు గురై నిద్రలోనే తనువు చాలించాడు.

రెండు నెలల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు.. గురువారం రాత్రి గుండెపోటుకు గురై నిద్రలోనే తనువు చాలించాడు. ఈ మధ్య చిన్న వయసు వారు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్ అనంతరం ఇలాంటి సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిణామానికి వైద్యులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీవనశైలిలో మార్పు అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది.

సికింద్రాబాద్ మల్కాజ్ గిరికి చెందిన కానుగుల బాలరేవంత్ తండ్రి అశోక్ రైల్వే ఉద్యోగి. ఆయనకు ఇద్దరు కుమారులు.. చిన్న కుమారుడు రేవంత్ ఎమ్మెస్ చదివేందుకు రెండు నెలల క్రితం చికాగో వెళ్లాడు. అక్కడ స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. గురువారం అందరూ కలసి డిన్నర్ కు వెళ్లొచ్చారు. అనంతరం రూమ్ కి వచ్చి నిద్ర పోయారు. ఉదయం రేవంత్ లేవకపోయేసరికి స్నేహితులు లేపడానికి ప్రయత్నించారు.

శ్వాస ఆడకపోవడంతో నిద్రలోనే గుండెపోటుకు గురై మృతి చెంది ఉంటాడని భావించారు. స్నేహితులు రేవంత్ సోదరుడికి ఫోన్ చేసి విషయం చెప్పారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తమ కుమారుడు మరణించడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని భారత్ కు తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story