floating restaurant,: సముద్రంలో మునిగిపోయిన ఫ్లోటింగ్ రెస్టారెంట్..

floating restaurant,: సముద్రంలో మునిగిపోయిన ఫ్లోటింగ్ రెస్టారెంట్..
floating restaurant,: హాంగ్‌కాంగ్‌లోని ఐకానిక్ జంబో రెస్టారెంట్ దక్షిణ చైనా సముద్రంలో 1000 మీటర్ల కంటే ఎక్కువ లోతులో మునిగిపోయింది.

Floating Restaurant: హాంగ్‌కాంగ్‌లోని ఐకానిక్ జంబో రెస్టారెంట్ దక్షిణ చైనా సముద్రంలో 1000 మీటర్ల కంటే ఎక్కువ లోతులో మునిగిపోయింది. దాంతో దీనిని తిరిగి తీసుకురావడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. హాంకాంగ్‌లోని ప్రఖ్యాత జంబో ఫ్లోటింగ్ రెస్టారెంట్ దక్షిణ చైనా సముద్రంలో 'ప్రతికూల పరిస్థితులు' ఎదురవడంతో బోల్తా పడింది. టగ్‌బోట్‌ల ద్వారా ఈ నౌకను లాగుతున్నప్పుడు మునిగిపోయింది. అయితే ఈ ఘటనలో సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు.

ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద తేలియాడే రెస్టారెంట్‌గా పేర్కొనబడిన జంబో కింగ్‌డమ్ అనేక హాంకాంగ్ మరియు అంతర్జాతీయ చలనచిత్రాలలో కనిపించింది. క్వీన్ ఎలిజబెత్ II, జిమ్మీ కార్టర్, టామ్ క్రూజ్‌లతో సహా పలు ప్రముఖులకు ఆతిథ్యం ఇచ్చింది.

అబెర్డీన్ రెస్టారెంట్ ఎంటర్‌ప్రైజెస్, ఒక అధికారిక ప్రకటనలో, ఈ సంఘటన చాలా బాధ కలిగించిందని పేర్కొంది. మునిగిపోవడానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు కోసం హాంకాంగ్ ప్రభుత్వం నివేదికను కోరింది.

2013 నుండి, ద్వీపం యొక్క దక్షిణ నౌకాశ్రయంలో ఫిషింగ్ జనాభా తగ్గిపోవడంతో రెస్టారెంట్ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. మార్చి 2020లో కోవిడ్ మహమ్మారి సమయంలో, $13 మిలియన్ల వరకు నష్టాలు చవిచూసిందని రెస్టారెంట్ యజమానులు ప్రకటించి మూసివేశారు. తదుపరి నోటీసు వచ్చేవరకు రెస్టారెంట్ మూసివేయబడుతుందని ప్రకటించారు.

రెస్టారెంట్‌ను పునరుద్ధరించడానికి అనేక ప్రతిపాదనలు వచ్చినప్పటికీ, ప్రతి సంవత్సరం అధిక నిర్వహణ రుసుములు పెట్టుబడిదారులను నిరోధించాయి. కోవిడ్ తర్వాత దానిని నిర్వహించేందుకు చాలినన్ని నిధులు లేవు. ఈ నేపథ్యంలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ మునిగిపోయిందనే వార్త రెస్టారెంట్ ప్రియులను కలవరపరిచింది.

Tags

Read MoreRead Less
Next Story