Sputnik V: మే1 న భారత్ కి స్పుత్నిక్-వి..!

Sputnik V:  మే1 న భారత్ కి స్పుత్నిక్-వి..!
రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ స్పుత్నిక్-వి తొలి బ్యాచ్ డోసులు మే 01న భారత్ కి చేరుకోనున్నట్లుగా రష్యన్ అధికారులు వెల్లడించారు.

రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ స్పుత్నిక్-వి తొలి బ్యాచ్ డోసులు మే 01న భారత్ కి చేరుకోనున్నట్లుగా రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) హెడ్‌ కిరిల్‌ దిమిత్రివ్‌ సోమవారం వెల్లడించారు. అయితే తొలి కన్‌సైన్‌మెంట్‌లో ఎన్ని డోస్ లు ఉంటాయి.. వాటిని ఎక్కడ తయారు చేయనున్నారనే అంశాలపైన స్పష్టత ఇవ్వలేదు. వేసవి చివరినాటికి భారత్ లో నెలకి 50 మిలియన్ డోసుల చొప్పున టీకాలను ఉత్పత్తి చేసే అవకాశలున్నట్లుగా చెప్పారు. ఈ టీకా అత్యవసర వినియోగానికి భారత్ ఇటీవల అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story