ఐక్యరాజ్యసమితి వేదికగా చైనాను చిత్తు చేసిన భారత్

ఐక్యరాజ్యసమితి వేదికగా చైనాను చిత్తు చేసిన భారత్
ఐక్యరాజ్యసమితి సాక్షిగా చైనాకు భారత్ గట్టి షాక్ ఇచ్చింది. ఐక్యరాజ్యసమితి ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ కౌన్సిల్‌ లో మహిళ

ఐక్యరాజ్యసమితి సాక్షిగా చైనాకు భారత్ గట్టి షాక్ ఇచ్చింది. ఐక్యరాజ్యసమితి ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ కౌన్సిల్‌ (ఇసోసాక్‌)లో మహిళ అభ్యన్నతి కోసం ఏర్పాటైన కమిషన్‌లో భారత్‌ సభ్యత్వం సాధించింది. భారత్ తో పోటికి నిలిచిన చైనా చిత్తుగా ఓడిపోయింది. ఈ విషయాన్ని ఐక్యారాజ్య సమితి భారత శాశ్వత ప్రతినిధి టీ ఎస్ తిరుమూర్తి తెలిపారు. స్త్రీపురుష సమానత్వానికి, మహిళా అభ్యున్నతికి భారత్ చేసిన కృషికి ఇది నిదర్శనమని ఆయన ట్వీట్ చేశారు. భారత్ గెలుపుకు కారణమైన అన్ని దేశాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కమిషన్ లో భారత్ 2021 నుంచి 2025 వరకూ కొనసాగనుంది. ఈ కమిషన్‌లో సభ్యత్వం కోసం భారత్‌తో పాటు చైనా, అఫ్ఘనిస్థాన్ కూడా పోటీపడ్డాయి. ఈ కౌన్సిల్‌లో మొత్తం 54 ఓట్లు ఉండగా, సభ్యత్వం కోసం 28 ఓట్ల మెజారిటీ అవసరం. అయితే, ఆఫ్ఘన్‌కు 39 ఓట్లుతో సభ్యత్వాన్న సొంతం చేసుకోగా.. భారత్‌కు 38 ఓట్లు లభించాయి. కానీ, ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం ఉన్న చైనా 27 ఓట్లతో సభ్యత్వాన్ని కోల్పోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.

Tags

Read MoreRead Less
Next Story