Canada: నిజ్జర్ హత్యపై కెనడా దర్యాప్తు సరిగా లేదు

Canada: నిజ్జర్ హత్యపై కెనడా దర్యాప్తు  సరిగా లేదు
భారత్ పాత్రను నిరూపించే ఆధారాలు ఇవ్వలేదన్న కెనడాలోని భారత రాయబారి

కెనడాలో ఓ ఉన్నతస్థాయి వ్యక్తి బహిరంగ వ్యాఖ్యల కారణంగా ఖలిస్థానీ వేర్పాటువాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో దర్యాప్తు దెబ్బతిందని కెనడాలోని భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ తాజాగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు కెనడా ప్రధానిపై ఆయన పరోక్ష విమర్శలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో సంజయ్ శర్మ చేసిన వ్యాఖ్యలు స్థానిక పత్రికలో తాజాగా ప్రచురితమయ్యాయి. కెనడాతో దౌత్య సంబంధాల ప్రతిష్టంభనపై భారత వైఖరిని పునరుద్ఘాటించారు. భారత రాయబారి సంజయ: కుమార్‌ వర్మ అంతర్జాతీయ మీడియా గ్లోబ్‌ అండ్‌ మెయిల్‌తో మాట్లాడారు. నిజ్జర్‌ హత్యలో భారతదేశ ప్రమేయం ఉందని ఆరోపించిన కెనడా, దాని మిత్ర దేశాలు ఆధారాలు చూపించలేదని స్పష్టం చేశారు. ఈ కేసు దర్యాప్తులో వారికి సహాయం చేయడానికి మాకు నిర్దిష్ట లేదా సంబంధిత సమాచారం అందించలేదు. '' సాక్ష్యాలు ఎక్కడ ఉన్నాయి. విచారణ ముగింపు ఏమిటి. నేను ఒక అడుగు ముందుకు వేసి వెల్లడిస్తున్నాను. ఈ దర్యప్తు మొత్తాన్ని తారుమారు చేశారు '' అని అన్నారు. ''


ఈ ఏడాది జూన్‌లో వాంకూవర్‌లో కెనడా పౌరుడైన నిజ్జర్ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన వెనక భారత సీక్రెట్ ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని ఆరోపించడం పెద్ద దౌత్య వివాదానికి దారితీసింది. అయితే, భారత్ ఈ ఆరోపణలను ఖండించింది. ఈ ఘటనపై భారత రాయబారి తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘ఈ కేసుపై దర్యాప్తు సందేహాస్పదమైంది. ఘటన వెనక భారత్ లేదా భారతీయులు ఉన్నారని ప్రకటించాలంటూ ఉన్నత స్థాయి వ్యక్తి నుంచి మార్గదర్శకాలు జారీ అయ్యాయి’’ అని వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు బెదిరింపులు వచ్చాయని .. దీంతో తనకు రాయల్‌ కెనడియన్‌ మౌంటెడ్‌ పోలీస్‌ (ఆర్‌సిఎంపి) భద్రత కల్పించినట్లు వర్మ వెల్లడించారు. తన సహచర దౌత్యవేత్తలకు కెనడాలో ముప్పు పొంచి ఉందని అన్నారు.

ఈ హత్య వెనక భారత ఏజెంట్లు ఉన్నారని చెప్పేందుకు కెనడా గానీ దాని మిత్ర దేశాలు కానీ ఇప్పటివరకూ గట్టి ఆధారాలేవీ చూపించలేదని వర్మ పేర్కొన్నారు. అయితే, ఇరుదేశాల దౌత్య బంధం ఒత్తిడిలో ఉన్నప్పటికీ కెనడాతో వ్యాపార సంబంధాలు విస్తృతపరిచేందుకు భారత్ సంసిద్ధంగా ఉందన్నారు. వాణిజ్య ఒప్పందంపై చర్చలకు రెడీగా ఉందని వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story