International: పాదచారులపైకి దూసుకెళ్లిన వ్యాను... ఇద్దరు మృతి

International: పాదచారులపైకి దూసుకెళ్లిన వ్యాను... ఇద్దరు మృతి
మృతి చెందిన వారిలో ఇద్దరు వృద్ధులు ఉన్నారని, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు

కెనడాలోని ఉత్తర క్యూబెక్‌లోని అమ్‌కీ పట్టణంలో పాదచారులపైకి వ్యాన్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు, తొమ్మిది మంది గాయపడ్డారు. మాంట్రియల్‌కు ఈశాన్యంగా 650 కిలోమీటర్లు (400 మైళ్లు) దూరంలో ఉన్న అమ్‌క్విలో రోడ్డు వెంబడి నడుస్తూ వారిని వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా తొమ్మిది మంది గాయపడ్డారు వీరిలో చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు. వ్యాన్ డ్రైవర్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మృతి చెందిన వారిలో ఇద్దరు వృద్ధులు ఉన్నారని, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. క్యూబెక్ ప్రధాని ఫ్రాంకోయిస్ లెగాల్డ్ ఈ ప్రమాదంపై స్పందించారు. ఇది దిగ్భ్రాంతికరమైన ఘటన అని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story