Isreal : నిర్మానుష్యంగా ఇజ్రాయెల్ నగరాలు

Isreal : నిర్మానుష్యంగా ఇజ్రాయెల్ నగరాలు
రోడ్లమీదికి రావాలంటే జంకుతున్న ప్రజలు

హమాస్ మిలిటెంట్ల దాడితో ఇజ్రాయెల్‌లో యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆ దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఎప్పుడు , ఏ మూల నుంచి ఉగ్రవాదుల దాడులు చేస్తారనే భయంతో ప్రజలు బయటకు రావాలంటేనే వంద్ సార్లు ఆలోచిస్తున్నారు.నిత్యం రద్దీగా ఉండే టెల్‌ అవీవ్‌ నగరంతో సహా పలు పట్టణాలోని రహదారులు వాహనాల రాకపోకలు, జనం లేక వెలవెలబోతోంది.

హమాస్‌ మిలిటెంట్ల దాడితో ఇజ్రాయెల్‌లోని ప్రధాన పట్టణాలు నిర్మానుష్యంగా మారాయి. 24 గంటలు రద్దీగా ఉండే టెల్‌ అవీవ్ నగరం ప్రస్తుతం ఎడారిని తలపిస్తోంది. వీధులు, ప్రధాన కూడళ్లలో కూడా జనాల రద్దీ గణనీయంగా తగ్గింది. దక్షిణ ఇజ్రాయెల్‌లోని పట్టణాల్లో హమాస్ మిలిటెంట్లు మారణహోమం సృష్టించడంతో ప్రజలు బయటకురావలంటేనే భయపడుతున్నారు. గాజా పట్టీ నుంచి వేలాది రాకెట్లను హమాస్‌ మిలిటెంట్లు టెల్‌ అవీవ్‌, జెరూసలెం సహా ఇజ్రాయెల్‌లోని ప్రధాన పట్టణాల లక్ష్యంగా ప్రయోగిస్తుండటంతో ఇజ్రాయెలీలు భయం గుప్పిట బతుకుతున్నారు. ఎటు నుంచి ఏ ప్రమాదం పొంచుకొస్తుందో అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. నాలుగు రోజులుగా కొనసాగుతున్న భీకర పోరులో ఇజ్రాయెల్‌, పాలస్తీనాలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. గాజా స్ట్రిప్ ఇజ్రాయెల్ పై 5000 రాకెట్లను ప్రయోగించినట్లు హమాస్ ప్రకటించింది. హమాస్ దాడి కారణంగా ఇప్పటివరకు 40 మంది మృతి చెందారు. రాకెట్లు, కాల్పులు, సైరన్ల శబ్దాలతో ఇజ్రాయెల్ నగరాలు హోరెత్తుతున్నాయి.

ఇప్పటివరకు తమ భూభాగంలో 1500 మంది హమాస్ మిలిటెంట్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. గాజా సరిహద్దుల వెంబడి ఇజ్రాయెల్ భారీగా సైనికులను మోహరించింది. ప్రస్తుతానికి ఇజ్రాయెల్‌లో ఎక్కడా హమాస్‌ మిలిటెంట్లతో పోరు జరగడం లేదని తెలిపింది. గాజా సరిహద్దులు పూర్తిగా తమ ఆధీనంలో ఉన్నట్లు తెలిపింది. యూదుల సెలవు దినమైన శనివారం తెల్లవారుజామున హఠాత్తుగా గాజా సరిహద్దుల నుంచి 5వేల రాకెట్లు, డజన్ల కొద్దీ యుద్ధ విమానాల ద్వారా మాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌ నగరాలపై మెరుపు దాడికి దిగారు. భూమి, ఆకాశం, సముద్ర మార్గాల్లో విరుచుకుపడ్డారు. ఈ దాడుల్లో ఇప్పటివరకు 300 మందికి పైగా మరణించారు. 1500 మందికిపైగా గాయపడ్డారు. హమాస్‌ ఉగ్రవాదుల మెరుపు దాడితో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైన ఇజ్రాయెల్‌ తేరుకుని పాలస్తీనాలోని గాజాపై వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో 232 మంది మరణించారు. మరో 1700 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story