ITALY: మరణశయ్యపై వీలునామా..ప్రియురాలికి 900 కోట్లు

ITALY: మరణశయ్యపై వీలునామా..ప్రియురాలికి 900 కోట్లు
ఇటలీ మాజీ ప్రధానమంత్రి సిల్వియో బెర్లుస్కోనీ చనిపోయే ముందు తన గార్ల్‌ఫ్రెండ్‌ మార్టా ఫాసినాకి 900 కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చారు.

ఇటలీ మాజీ ప్రధానమంత్రి సిల్వియో బెర్లుస్కోనీ గత నెలలో మరణించారు.అయితే ఆయన చనిపోయే ముందు తన గార్ల్‌ఫ్రెండ్‌ మార్టా ఫాసినాకి 900 కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చారు. ఆస్పత్రి బెడ్‌పైనే వీలునామా రాసి సంతకం చేశారు. మూడు సార్లు ప్రధానిగా ఉన్న ఆయన ఆస్తి మొత్తం ఆరు బిలియన్లకు పైనే ఉంటుందని సమాచారం.

మార్టా ఫాసినాతో బెర్లుస్కోనికి 2020 నుంచి గత మూడేళ్లుగా పరిచయం ఏర్పడింది. 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఫాసినా ఇటలీ పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేశారు. బెర్లుస్కోనీ స్థాపించిన ఫోర్జా ఇటాలియా పార్టీలో సభ్యురాలుగా కూడా ఉన్నారు. ఇరువురి మధ్య స్నేహం తర్వాత మరింత దగ్గరయ్యారు. అయితే బెర్లుస్కోనీ వ్యాపారాన్ని ఆయన పిల్లలు మెరీనా, పీర్ సిల్వియోలు చూసుకుంటున్నారు. వ్యాపార వాటాలో 53 శాతం కుటుంబంపై ఉంది. వీలునామాలో తన సోదరుడు పాలోకు 100 మీలియన్ల యూరోలను కేటాయించారు. మాఫియాతో చేతులు కలిపి జైలు శిక్ష అనుభవించిన తన పార్టీ మాజీ సెనేటర్ మార్సెల్లో డెల్ ఉట్రీకి 30 మీలియన్ల యూరోలను ఇచ్చారు.

ఇక తనకు మిగిలిన ఆస్తిలో పిల్లలు మెరీనా, పియర్ సిల్వియోలకు సమాన భాగాలుగా పంచి ఇస్తున్నట్లు వీలునామా రాసిన బెర్లుస్కోనీ మిగిలిన ఆస్థిని ఐదుగురు పిల్లలు మెరీనా, పీర్ సిల్వియో, బార్బరా, ఎలియోనోరా, లుయిగికి సమాంగా పంచారు. మార్టా ఫాసినాను అధికారికంగా పెళ్లి చేసుకోకపోయినా వీలునామాలో మాత్రం భార్యగా పేర్కొని ఆస్తిని కేటాయించారు. ల్యుకేమియాతో బాధపడుతున్న బెర్లుస్కోనీ 86 ఏళ్ల వయసులో గత జూన్‌ 12న మరణించారు.వ్యాపార వేత్తగా, ప్రధానిగా రాణించిన ఆయనపై పలు కేసులు కూడా ఉన్నాయి. పన్నుల ఎగవేతకు సంబంధించిన కేసులో ఆరేళ్ల పాటు రాజకీయం నుంచి నిషేధానికి కూడా గురయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story