అమెరికా ఆరోగ్య సిబ్బంది అనుభవాలపై కంటతడిపెట్టిన జో బైడెన్‌

అమెరికా ఆరోగ్య సిబ్బంది అనుభవాలపై కంటతడిపెట్టిన జో బైడెన్‌

ట్రంప్‌పై విజయం సాధించి అగ్రరాజ్యాధినేతగా ఎన్నికైన జో బైడెన్‌ ఎమోషనల్ అయ్యారు. ఆరోగ్య సిబ్బందితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. కరోనా విధుల్లో ఉన్న ఆ దేశ ఆరోగ్య సిబ్బంది తమ క్షేత్ర స్థాయి అనుభవాలను కాబోయే అధ్యక్షుడికి తెలియజేశారు. ఈ సందర్భంగా జో బైడెన్‌ కంటతడిపెట్టారు.

మిన్నెసోటాకు చెందిన మేరీ టర్నర్‌ అనే నర్స్‌.. మరణానికి చేరువలో ఉన్న కొవిడ్‌-19 బాధితులతో తన అనుభవాలను వివరించారు. కొవిడ్‌ బాధితులు తమ కుటుంబ సభ్యులు, ఆత్మీయుల కోసం పరితపించే వారని, వారి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని ఓదార్చానని మేరీ చెప్పారు. అది విన్న బైడెన్‌ ఒకింత భావోద్వాగానికి గురై కన్నీరు కార్చారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో.. పలువురు నర్సులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను బైడెన్‌కు వివరించారు. PPE కిట్ల కొరత వేధిస్తోందన్నారు. రక్షణ కోసం తాము ప్లాస్టిక్‌ సంచులను వాడుతున్నామని కొందరు బైడెన్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఎన్- 95 మాస్కులను మళ్లీ మళ్లీ వాడటంతో అవి లూజ్‌గా మారి కింద పడిపోయిన సందర్బాలూ ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి అనుభవాలు విన్న బైడెన్‌ కన్నీరు ఆపుకోలేకపోయారు.

Tags

Read MoreRead Less
Next Story