Viral News: చిన్నప్పుడు అన్నీ పంచుకున్నారట.. పెద్దయ్యాక భర్తను కూడా..
Viral News: అక్కకి లైన్ ఏద్దామని చెల్లెళ్లతో రాయబారం నడిపితే వాళ్లిద్ధరు కూడా అతడితో ప్రేమలో పడ్డారు..

Viral News: అక్కకి లైన్ ఏద్దామని చెల్లెళ్లతో రాయబారం నడిపితే వాళ్లిద్ధరు కూడా అతడితో ప్రేమలో పడ్డారు..పెళ్లంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటామని ముగ్గురూ మూకుమ్మడిగా తీర్మానం చేసేసరికి.. చేసుకోక తప్పలేదు అతగాడికి.. ముగ్గురికీ సమాన ప్రేమను పంచుతానంటున్నాడీ నవ మన్మధుడు.
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో బహుభార్యత్వం అమలులో ఉంది. ఇంక ఎదురేముంది అనుకున్నాడో వ్యక్తి ముగ్గురు సోదరీమణులను పెళ్లి చేసుకున్నాడు. ముగ్గురూ ఒకేసారి అతడికి ప్రపోజ్ చేయడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.. వెంటనే తేరుకుని కొన్ని రోజులు ఆలోచించిన తర్వాత ఒకే రోజు ముగ్గురిని వివాహం చేసుకున్నాడు. 32 ఏళ్ల లువిజో.. నడేగే, నటాషా, నటాలీ అనే ముగ్గురు అక్కచెల్లెళ్లను వివాహం చేసుకున్నాడు.
ముగ్గురు అక్కచెల్లెళ్లు ప్రపోజ్ చేసినప్పుడు నో చెప్పలేక పోయానని అన్నాడు. "నేను వారందరినీ వివాహం చేసుకోవలసి వచ్చింది, ఎందుకంటే వారు ముగ్గురూ ఉన్నారు. ఇది అంత తేలికైన నిర్ణయం కాదు, నేను ఏమి చేస్తున్నానో నా తల్లిదండ్రులకు అర్థం కాలేదు. మా కుటుంబానికి నా నిర్ణయం ఇష్టం లేదు.. అందుకే వాళ్లెవరూ వివాహానికి హాజరుకాలేదని లూజో తెలిపాడు.
ఒకటి పొందాలంటే మరొకదానిని పోగొట్టుకోవాలి. ఇతరులు ఏమనుకున్నా నేను ముగ్గురిని పెళ్లి చేసుకోవడం సంతోషంగా ఉంది. ప్రేమకు పరిమితులు లేవు అని అంటున్నాడు. ముందు తాను నటాలీతో ప్రేమలో పడ్డానని లువిజో చెప్పాడు. అయితే, నటాలీ తన కవల సోదరీమణులు నడేగే, నటాషాలకు పరిచయం చేసింది. కానీ వాళ్లిద్దరికీ ముందే అతడితో పరిచయం.. అక్కకి లైన్ వేస్తున్నాడని తెలుసుకున్నారు..
ఈ క్రమంలో వారిద్దరు కూడా అతడితో ప్రేమలో పడ్డారు. అదే విషయాన్ని లువిజోతో చెప్పినప్పడు ముందు ఆశ్చర్యపోయాడు.. ఆ తరువాత మూర్ఛపోయాడు. వెంటనే తేరుకుని తాను విన్నది నిజమా కాదా అని సంశయించాడు.. నిజమని తెలిసి బాధపడాలో సంతోషించాలో అర్థం కాలేదు ఒక్క క్షణం లువిజోకి.
ముగ్గురు సోదరీమణులలో ఒకరు మాట్లాడుతూ.. చిన్నప్పటి నుండి ప్రతిదీ ముగ్గురం పంచుకునే వారమని, కాబట్టి భర్తను పంచుకోవడం తమకు కష్టం కాదని అంటున్నారు. అందుకేనేమో ప్రేమ గుడ్డిది అంటారు.
RELATED STORIES
Dhanush: ధనుష్ తమ కొడుకే అంటున్న దంపతులు.. చట్టపరంగా నోటీసులు పంపిన...
21 May 2022 3:55 PM GMTNTR 30: కొరటాల, ఎన్టీఆర్ మూవీ.. తెరపైకి మరో బాలీవుడ్ భామ పేరు..
21 May 2022 3:08 PM GMTVishwak Sen: రెమ్యునరేషన్ పెంచేసిన విశ్వక్ సేన్.. నిర్మాతలకు షాక్..
21 May 2022 2:25 PM GMTRakshit Shetty: నటితో రష్మిక ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ పెళ్లి.. క్లారిటీ...
21 May 2022 1:41 PM GMTMahesh Babu: ఏంటా వరసలు.. ఒకసారి వచ్చికలువు: యూట్యూబర్ తో మహేష్ బాబు
21 May 2022 12:30 PM GMTSudhakar Komakula: తండ్రైన 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' యాక్టర్.. క్యూట్...
21 May 2022 12:01 PM GMT