Jason Arday: 18 ఏళ్ల తరువాతే బడికి.. ఇప్పుడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్

Jason Arday: 18 ఏళ్ల తరువాతే బడికి.. ఇప్పుడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్
Jason Arday: 18 సంవత్సరాల వయస్సు వరకు నిరక్షరాస్యుడైన వ్యక్తి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయ్యాడు.

Jason Arday: 18 సంవత్సరాల వయస్సు వరకు నిరక్షరాస్యుడైన వ్యక్తి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయ్యాడు. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌తో బాధపడుతున్న జాసన్ ఆర్డే తన జీవితంలో ప్రారంభంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నానని తెలిపాడు. అతడికి జీవితకాలం ట్రీట్‌మెంట్ అవసరమని వైద్యులు తేల్చిచెప్పారు. ఈ క్రమంలోనే అతడు చిన్నప్పుడు స్కూల్ ముఖం చూడలేదు. 11 ఏళ్లు వచ్చే వరకు మాటలు కూడా రాలేదు. 18 ఏళ్ల తరువాతే చదవడం, రాయడం నేర్చుకున్నాడు. ఇప్పుడు కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో ప్రొఫెసర్ అయిన అత్యంత పిన్నవయస్కుడు ఈ నల్లజాతి యువకుడు.

జాసన్ అర్డేకు ఇప్పుడు 37 ఏళ్లు. వచ్చే నెలలో విశ్వవిద్యాలయంలో సోషియాలజీ ప్రొఫెసర్‌గా తన కెరీర్ ప్రారంభించనున్నాడు. మొత్తం 23వేల మంది ప్రొఫెసర్లలో కేవలం 155 మంది మాత్రమే బ్లాక్ ప్రొఫెసర్లు ఉన్నారు ఆ యూనివర్సిటీలో. చదువుకు దూరమై ఇంట్లో ఉన్నప్పుడు తన లక్ష్యాలను గోడల మీద రాసుకునేవాడు.. అవి తల్లికి చూపించి ముచ్చటపడేవాడు. అలా గోడల మీద రాసిన వాటిలో ఒకటి "ఒక రోజు నేను ఆక్స్‌ఫర్డ్ లేదా కేంబ్రిడ్జ్‌లో పని చేస్తాను." తన కల నెరవేరింది. తన యుక్తవయస్సులో చదవడం, వ్రాయడం ఎలాగో నేర్చుకున్నాడు. విశ్వవిద్యాలయంలో చదివిన తర్వాత PE ఉపాధ్యాయుడిగా మారాడు.

ఉన్నత విద్యను బోధించాలనే తన కలను నెరవేర్చుకునేందుకు ఎన్నో అవహేళలను భరించాడు. చివరకు తన ప్రయత్నం ఫలించి ఇప్పుడు 2 ర్యాంక్ పొందిన విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా ఉన్నాడు. ఆర్డే, కమ్యూనికేట్ చేయడానికి సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పటికీ, PE టీచర్ కావడానికి విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ మరియు లివర్‌పూల్ జాన్ మూర్స్ విశ్వవిద్యాలయం నుండి PhD సంపాదించాడు. తనను ఈ స్థాయికి తీసుకువచ్చిన స్నేహితుడు, గురువు అయిన సాండ్రో శాండి ప్రోత్సాహం మరువలేనిది అని చెబుతాడు. తన భవిష్యత్తు లక్ష్యాల గురించి మాట్లాడుతూ, అర్డే ఇలా అన్నాడు: "ప్రధానంగా వెనుకబడిన నేపథ్యాల నుండి వచ్చిన వారికి ఉన్నత విద్య ఎలా అందుతుంది అనే దానిపై దృష్టి సారిస్తానని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story